ప్రభాస్ తర్వాత.. శ్రేయా ఘోషల్ కూడా

Update: 2017-03-16 04:30 GMT
బాలీవుడ్ సూపర్ సింగర్ శ్రేయా ఘోషల్ గురించి మన శ్రోతలకు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ పదుల సంఖ్యలో అద్భుతమైన పాటలు పాడి మన మ్యూజిక్ లవర్స్ మనసు దోచింది ఈ భామ. శ్రావ్యమైన గొంతుకు తోడు అందమైన రూపం కూడా శ్రేయ సొంతం. అందుకే ఆమెను కోట్లాది మంది అభిమానిస్తారు. ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ సింగర్ ఎవరంటే మరో మాట లేకుండా శ్రేయ పేరు చెప్పేయొచ్చు. గత కొన్నేళ్లలో గొప్ప పాపులారిటీకి తోడు ఎన్నో అవార్డులు కూడా దక్కించుకున్న శ్రేయ ఇప్పుడు అరుదైన గౌరవం దక్కించుకుంది.

గత ఏడాది ఢిల్లీలో ఏర్పాటైన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రేయ మైనపు బొమ్మను పెట్టనున్నారు. ముందుగా లండన్లో మొదలైన టుస్సాడ్స్ మ్యూజియం.. తర్వాత అనేక దేశాలకు విస్తరించింది. మన దేశంలో ఏర్పాటైన మ్యూజియం 23వది. ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తదితరుల మైనపు విగ్రహాలున్నాయి. వాటి పక్కన శ్రేయ విగ్రహానికీ చోటు దక్కనుంది. తాజాగా ఆమె నుంచి విగ్రహం కోసం కొలతలు కూడా తీసుకున్నారు. ఈ మ్యూజియంలో తన విగ్రహం పెడుతుండటం పట్ల చాలా థ్రిల్లింగ్ గా ఉందని శ్రియ తెలిపిందే గత ఏడాది మన ‘బాహుబలి’ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని బ్యాంకాక్‌ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News