బాలకృష్ణ వందో చిత్రంగా రూపొందిన గౌతమిపుత్ర శాతకర్ణి.. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో సౌత్ బ్యూటీ శ్రియ హీరోయిన్ గా నటించింది. మహారాణి వశిష్టీ దేవిగా ప్రేక్షకులను అలరించనుంది.
మరి మహారాణి అంటే ఏ స్థాయిలో ఉండాలి.. రాజసం.. హుందాతనంతో పాటు అందం.. కళ్లలో తేజస్సు.. అన్నిటికీ మహరాజును కట్టిపడేసే కనికట్టుకు కంటి చూపులోనే ప్రదర్శించగలగాలి. అన్నీ ఉన్న శ్రియ.. శాతకర్ణి మూవీలో వశిష్టీ దేవిగా ఇట్టే ఒదిగిపోయినట్లుగా కనిపిస్తోంది. తన ఒంపులు ఒయ్యారాలతో.. తాను మహరాజునని తానే మరిచిపోయానని స్వయంగా శాతకర్ణితో పాట పాడించారంటే.. శ్రియ ఎంత ఆకర్షణ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచాన్ని గడగడలాడించిన శాతకర్ణి కూడా ఆమె అందానికి అందుకే దాసోహం అనేశాడు. రాణి పాత్రకు ఏ మాత్రం విలువ తగ్గకుండా ఆమెతో ధరింపచేసిన కాస్ట్యూమ్స్ కూడా ప్రధాన ఆకర్షణ అయ్యాయని అనడంలో సందేహం అక్కర్లేదు.
నటనలోనే కాదు.. నాట్యంలోనూ ఆరితేరిన శ్రియ.. వశిష్టీ దేవి పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందని అనడంలో సందేహాలు అక్కర్లేదు. ఆ పాత్రలో ఆమె ఎంతగా ఒదిగిపోయిందో.. మెరుపులు కురిపించిందో చెప్పడానికి ఈ ఒక్క ఫోటో సాక్ష్యంగా సరిపోతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/