ఫోటో స్టోరీ: ఆండ్రీ-శ్రియ ఫుల్ ఫ్రీ అబ్బా!

Update: 2020-03-19 10:10 GMT
హీరోయిన్ శ్రియ 2018 తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొస్చీవ్ ను మనువాడి శ్రీమతిగా మారిపోయింది. నిమాలలో కాస్త జోరు తగ్గించింది. ఇప్పటికీ శ్రియ చేతిలో ఒకటి రెండు నాలుగు సినిమాలు ఉన్నాయి కానీ గతంలో మాదిరిగా ఫుల్ బిజీగా అయితే ఉండడం లేదు. గ్యాప్ దొరికితే చాలు భర్తతో ఏదో ఒక వెకేషన్ కు చెక్కేయడం.. అక్కడ అచ్చికబుచ్చికలాడడం అనేది ఒక ముఖ్యమైన మిషన్ గా పెట్టుకుంది.

అయితే ఇప్పుడు కరోనా దెబ్బకు అవుట్ డోర్ అచ్చిక బుచ్చికలకు స్వస్తి చెప్పి వాటిని ఇండోర్ కు షిఫ్ట్ చేసింది. జస్ట్ ఊరికే అలా కూర్చోకుండా అభిమానుల కోసం కరోనా జాగ్రత్తలు కూడా చెప్పింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసింది. క్యాప్షన్ లో "ఈ శనివారం 5 pm కు నా ఫస్ట్ ఇన్స్టా లైవ్. ఇది కష్టమైన సమయం. మనమందరం ఏకాకులమైపోయాం. మనకు ప్రియమైన వారు.. మన ఇంట్లో పెద్దవారు అందరూ భద్రంగా ఉండాలి. మనం ఇన్స్టా గ్రామ్ లో ఇంకొంచెం ఎక్కువ సమయం గడుపుదాం. మ్యూజిక్.. సినిమాలు.. పుస్తకాలు.. మంచి జ్ఞాపకాల గురించి మాట్లాడుకుందాం. ఆందోళనకు గురికావొద్దు. విశ్రాంతి లేకుండా పని చేస్తున్న డాక్టర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం" అంటూ ఓ పెద్ద మెసేజ్ ఇచ్చింది. ఇక వీడియోలో కూడా ఇలాంటిదే మెసేజ్ చెప్పింది. భర్త ఆండ్రూ పై చెయ్యి వేసి మరీ ఈ మెసేజ్ ఇచ్చింది.

ఈ వీడియోనే కాకుండా మరో ఫోటో షేర్ చేసి "కొంచెం ప్రేమ.. కొంచెం సంతోషం పంచండి. నేను ఫైనల్ గా టిక్ టాక్ లోకి వచ్చాను అంటూ మరో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే శ్రియ ప్రస్తుతం బోయపాటి - బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తోంది.. ఈ సినిమా కాకుండా తమిళంలో 'సండకారి' అనే చిత్రంలో కూడా నటిస్తోంది.
Tags:    

Similar News