క్రికెటర్ తో శ్రియ టీ20 ఫ్రెండ్ షిప్

Update: 2017-04-26 10:32 GMT
టీ20 మ్యాచులంటే ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదుగా.. షార్ప్ అండ్ క్రిస్ప్ గా.. అలా మొదలై ఇలా ముగిసిపోతుంటాయి. అయినా సరే బోలెడంత వినోదం పంచుతుంటాయి. ఓ క్రికెటర్ తో శ్రియ ఫ్రెండ్ షిప్ కూడా ఇలాగే కనిపిస్తోంది.

వెస్టిండీస్ క్రికెటర్ డ్వాన్ బ్రేవోతో కలిసి చక్కర్లు కొడుతూ గతేడాది ఓసారి మీడియాకి చిక్కింది శ్రియా శరణ్. ఇద్దరూ కలిసి రెస్టారెంట్స్ కు తిరగడంతో.. శ్రియ-బ్రేవోల మధ్య ఏదో జరుగుతోందని అంతా గుసగుసలాడేసుకున్నారు. ఆ తర్వాత ఈ విషయంలో మెల్లగా సర్దుకుంది. అయితే.. ఓ ఇంటర్వ్యూలో తనకు శ్రియ మంచి ఫ్రెండ్ అని డ్వాన్ బ్రేవో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఐపీఎల్ ఆడేందుకు బ్రేవో ఇండియాలోనే ఉన్నాడు కదా. అందుకే మరి మీ ఫ్రెండ్ షిప్ ఎక్కడివరకూ వచ్చిందనే ప్రశ్న శ్రియకు ఎదురైంది. దీనికి శ్రియ ఇచ్చిన ఆన్సర్.. టీ20 మ్యాచ్ కంటే రంజుగా ఉంది.

'గతేడాది ఓ ఫ్యాషన్ షోలో బ్రేవోను కలిశాను. మళ్లీ ఇండియాకి వచ్చినప్పుడు ఇంకోసారి కలిశానంతే. నాకు అతని గురించి అంతగా తెలియదు. తను బాగా ట్యాలెంటెడ్ పర్సన్. అయితే.. తను నాకు పెద్ద స్నేహితుడేమీ కాదు. ఐపీఎల్ సీజన్ కోసం అతనికి బెస్టాఫ్ లక్' అని చెప్పింది శ్రియ. ఇంత షార్ట్ టెర్మ్ స్నేహాన్ని టీ20 ఫ్రెండ్ షిప్ అనడంలో తప్పేమీ లేదుగా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News