యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నట వారసత్వంను పునికి పుచ్చుకుని వచ్చిన శృతి హాసన్ అతి తక్కువ సమయంలోనే ఆయన నీడ నుండి బయట పడింది. అసలు కమల్ హాసన్ కూతురు అనే ట్యాగ్ ను శృతి ఎక్కడ కూడా వినియోగించదు. తాను ఒక స్టార్ కూతురును అనే విషయాన్ని కూడా ఆమె దృష్టిలో పెట్టుకోకుండా సినిమాలకు కమిట్ అవుతూ ఉంటుంది. శృతి హాసన్ కెరీర్ ఆరంభం నుండి సొంత నిర్ణయాలు తీసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. కెరీర్ లో ఒడి దొడుకులు ఎదుర్కొన్న శృతి హాసన్ మల్టీ ట్యాలెంటెడ్ అంటూ ఇప్పటికే నిరూపించుకుంది. అందుకే ఆమె జీవిత కథను సినిమా తీస్తే బాగుంటుందని ఒక అభిమాని భావించాడు. తాజాగా శృతి చిట్ చాట్ లో ఒక అభిమాని మీ బయోపిక్ కు టైటిల్ ఏమనుకుంటున్నారు అంటూ అడిగేశాడు.
శృతి హాసన్ ఆ అభిమాని ప్రశ్నకు సిల్లీగా కాకుండా సీరియస్ గానే సమాధానం ఇచ్చింది. బయోపిక్ ఆలోచన లేదు.. అంత సీన్ లేదు అనకుండా 'జ్వాలముఖి' అంటూ టైటిల్ పెడతాను అంటూ చెప్పేసింది. అంత పవర్ ఫుల్ టైటిల్ ను ఆమెకు ఆమె చెప్పుకుంది కనుక ఖచ్చితంగా ఆమె చాలా పవర్ ఫుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తుంది. జ్వాల ముఖి మాదిరిగా చాలా వెలుగుతున్నా కూడా ఆ వెలుగు వెనుక చాలా స్టోరీ ఉంది అనేది శృతి హాసన్ టైటిల్ ఉద్దేశ్యం అయ్యి ఉంటుంది. క్రాక్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శృతి హాసన్ మూడవ సారి పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. వరుసగా సినిమాలు షోలు చేస్తున్న శృతి హాసన్ భవిష్యత్తులో నిజంగానే బయోపిక్ ను ప్లాన్ చేయాలంటూ అభిమానులు కోరుతున్నారు.