ఫోటో స్టోరి: నీ ఒళ్లు బంగారం కాను

Update: 2020-07-07 04:30 GMT
క్రియేటివిటీకి హ‌ద్దులే లేవ్. చూసే దృష్టిని బ‌ట్టి ప్ర‌తిదీ మారిపోతుంది. ముఖ్యంగా ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో రెగ్యుల‌ర్ గా ఎంతో క్రియేటివిటీ మ‌రెన్నో కొత్త కోణాలు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. ఇటీవ‌ల‌ డిజైన‌ర్ వేర్ అన్న ప‌దానికే అర్థం మారిపోతోంది. కేవ‌లం క్లాత్ ఉప‌యోగించి డిజైన్ ని పూర్తి చేయ‌డం అన్న‌ది అరుదు. ఇటీవ‌లి కాలంలో లోహాల్ని ఎంతో క్రియేటివ్ గా ఉప‌యోగిస్తున్నారు. ఒక రకంగా వేడెక్కించే అందాల భామ‌ల్ని బంగారం.. రాగి.. వెండి.. ఇత్త‌డి వంటి ధాతువులతో త‌యారు చేసిన డిజైన్ల‌తో మ‌రింతగా హాట్ హాట్ గా మార్చేస్తున్నారు.

తాజాగా ప్ర‌ఖ్యాత జే.ఎఫ్.డ‌బ్ల్యూ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ పై శ్రుతిహాస‌న్ లుక్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. నెవ్వ‌ర్ బిఫోర్ అన్నంత‌గా శ్రుతి వేడెక్కించే లుక్ తో ద‌ర్శ‌న‌మిచ్చింది. ముఖ్యంగా టాప్ ఇన్న‌ర్ అందాల్ని క‌వ‌ర్ చేసేందుకు ఇంత‌కుముందులా లోదుస్తుల్ని ధ‌రించాల్సిన అవ‌స‌ర‌మే క‌నిపించ‌లేదు. ఆ స్థానంలో ప్ర‌త్యేకించి బంగారంతో త‌యారు చేసిన క‌డియాల్ని ఉప‌యోగించారు ఫ్యాష‌న్ డిజైన‌ర్.

డిజైన‌ర్ స్పెష‌లిస్టుల‌ కే చెమ‌ట‌లు ప‌ట్టించేస్తోంది ఈ స్పెష‌ల్ లుక్. ఆ వంగ పువ్వు రంగు మ‌ఖ‌మ‌ల్ కోట్ కి ఇన్ సైడ్ నాలుగు లేయ‌ర్లుగా క‌నిపిస్తున్న గోల్డ్ షైన్ డిజైన‌ర్ లోహ‌పు దుస్తులు శ్రుతి అందాల్ని ప‌దింత‌లు హైలైట్ చేస్తున్నాయి. ఒక ర‌కంగా ఈ అమ్మ‌డి ప్ర‌స్తుత మాన‌సిక స్థితికి ఇది నిలువుట‌ద్దం అని చెప్పాలి. మేఖేల్ కోర్స‌లేతో విడిపోయాక శ్రుతి తిరిగి క‌థానాయిక‌గా కెరీర్ ని వెతుక్కుంటోంది. ఆ క్ర‌మంలోనే తెలుగు-త‌మిళంలో ఒక్కో సినిమాకి కమిటైంది. తెలుగులో క్రాక్ రిలీజ్ కి రావాల్సి ఉంది.
Tags:    

Similar News