చిత్ర పరిశ్రమలో తన ఎంట్రీతో ఒక ఊపు ఊపేసి.. అగ్ర హీరోలతో జత కట్టిన శ్రుతిహసన్.. తర్వాత కాలంలో కనిపించకపోవటం.. మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న తీరులో సినిమాల్లో సందడి చేస్తున్నారు. రీల్ లైఫ్ కు మించిన ట్విస్టు.. ఆమె రియల్ లైఫ్ లోనూ ఉన్నాయన్న విషయం తెలిసిందే. తాజాగా తన అభిమానులతో మాట్లాడేందుకు సిద్ధమైన ఆమె.. మీకు నచ్చిన ప్రశ్నను అడగండి.. మీకు సమాధానం చెబుతానన్న ఆమె మాటకు పలువురు స్పందించారు. తాజాగా జరిగిన చాట్ లో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
మీ నాన్న కమల్ హాసన్ నుంచి మీరు నేర్చుకున్న మూడు విషయాలు చెప్పమంటే.. మూడు అంటే చెప్పలేనని.. చాలానే ఉన్నాయని చెప్పారు. నిర్భయంగా ఉండటం నేర్చుకున్నానని.. జీవితాన్ని ఉల్లాసంగా సాగాలంటే హాస్యం ముఖ్యమని కూడా తన తండ్రి నుంచే తెలుసుకున్నట్లు చెప్పారు. లక్ ను నమ్ముతారా? అంటే.. అంతకు మించిన కష్టపడటాన్ని నమ్ముతానని చెప్పారు.
మ్యూజిక్ పరంగా ఏ దశాబ్దం బెస్ట్ అనుకుంటున్నారన్న ప్రశ్నకు 1970 ఉత్తమమైనదని తాను అనుకుంటానని చెప్పారు. నిజాయితీగా ఉండటం బోలెడంత ఆనందాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని ఇన్నేళ్లలో తాను నేర్చుకున్న పాఠంగా చెప్పిన శ్రుతిహసన్.. అభిమానులు చూపించే ప్రేమ.. ఐస్ క్రీమ్.. అమెరికన్ కామెడీ మూవీ ‘యాంకర్ మ్యాన్’ ఈ మూడు తనను ఉల్లాసంగా.. ఉత్సాహంగా మార్చటానికి సరిపోతాయంటూ కొత్త విషయాన్ని వెల్లడించారు.