అయోమయం ప్రేమలో స్టార్ డాటర్

Update: 2019-04-26 06:24 GMT
స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా కాక గాయనిగా సంగీత దర్శకురాలిగా హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్ గత మూడేళ్ళుగా మైకేల్ కర్సోల్ తో ఘాడమైన ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇది అధికారికంగా ఆ ఇద్దరు చెప్పుకోకపోయినా వాళ్ళ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్స్ చూస్తే చిన్న పిల్లాడైనా ఈజీగా చెప్పేస్తాడు వీళ్ళ లవ్ స్టొరీ గురించి.

అయితే గత రెండు రోజులుగా ఇద్దరూ బ్రేకప్ అయ్యారని ఇకపై ప్రేమికులుగా ఉండే ఛాన్స్ లేదని అన్ని బాషా మీడియా వర్గాల్లో హోరెత్తిపోయింది. మైకేల్ కర్సోల్ స్వయంగా దీన్ని ప్రకటించాడంటూ పలు కథనాలు రావడంతో అందరు నిజమే అనుకున్నారు. నిజానికి ఈ ప్రేమ జంట అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది. నేరుగా ఏది చెప్పడం లేదు

మైకేల్ కర్సోల్ కూడా తన ఇన్స్ టా లో నా జీవితంలో అతి గొప్ప గర్ల్ ఫ్రెండ్ శ్రుతే అని అర్థం వచ్చేలా ఫోటో పెట్టాడు తప్ప తన భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్ లాంటివి చెప్పలేదు. కొద్దిరోజుల క్రితం శ్రుతి బర్త్ డే నాడు సైతం ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ కలిసున్న ఫోటో పెట్టి జీవితంలో దొరికీన అతి గొప్ప కానుక శృతి అని చెప్పి మైకేల్ తన ఉద్దేశాన్ని ఏంటో చెప్పకనే చెప్పాడు. మరోవైపు మీడియా ఎప్పుడు ప్రశ్నించినా శృతి సరైన సమాధానం ఇవ్వడం లేదు.

నాకు తోచినప్పుడు తోడు కావాలి అనుకున్నప్పుడు అందరికి చెప్పి మరీ పెళ్లి చేసుకుంటాను అని దాటవేస్తోంది తప్ప ఫలానా మైకేల్ నాకు కాబోయే భర్త అని ప్రకటించలేదు. కానీ ఫోటోల సాక్ష్యంగా దొరికిన ఆ ఇద్దరి చనువు ప్రేమను మించి అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఈ విషయంలో కూతురికి పూర్తి స్వేచ్చ ఇచ్చిన కమల్ కనీసం ఈ విషయంగా ఆలోచన కూడా చేస్తున్నట్టు లేడు. సో శృతి-మైకేల్ ల ప్రేమ కథ క్లైమాక్స్ కు వచ్చిందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగనుంది తప్ప ఇప్పటికిప్పుడు నిర్ధారణకు వచ్చే పరిస్థితి లేదు
Tags:    

Similar News