పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీ మూవీగా 'వకీల్ సాబ్' రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోణీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీలో అభితాబ్ నటించిన 'పింక్' చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా శృతి హాసన్ నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఈ జోడీని మరోసారి స్క్రీన్ పై చూడొచ్చని అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. 'గబ్బర్ సింగ్' 'కాటమ రాయుడు' సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న హ్యాట్రిక్ కొట్టబోతున్నారంటూ చెప్పుకున్నారు. 'వకీల్ సాబ్' లో పవన్ కల్యాణ్ – శ్రుతిహాసన్ ని జంటగా చూడాలనుకున్న మెగా అభిమానులు ఇప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కారణం శ్రుతి హాసన్ 'ఈ సినిమాలో నేను పనిచేయడం లేదు' అని బాంబు పేల్చటమే. ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన శృతి.. 'నేను వకీల్ సాబ్ సినిమాలో నటించడం లేదు.. అది అవాస్తవమైన వార్త.. ఆ వార్త నిజమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.. అవన్నీ రూమర్స్ కావడం వాళ్ళ నేను దాని గురించి మాట్లాడుకోవాలనుకోవడం లేదు' అంటూ సమాధానం చెప్పిందట.
శృతి హాసన్ ఇచ్చిన క్లారిటీతో.. 'వకీల్ సాబ్'లో శ్రుతి నటించడం పుకారే అనుకున్నారు జనాలు. అయితే నిజానికి ఈ సినిమా కోసం శ్రుతి హాసన్ సంతకాలు చేసిందట. అగ్రిమెంట్లు అన్నీ పూర్తయ్యాయని.. కానీ శ్రుతి హాసన్ అలా ఎందుకు చెప్పిందో అర్థం కావడం లేదని 'వకీల్ సాబ్' చిత్రబృందం చెబుతోందట. అగ్రిమెంట్లు అయ్యాక శ్రుతి ఈ సినిమా నుంచి తప్పుకుందా.. లేదంటే చిత్రబృందమే అధికారికంగా ప్రకటించే వరకూ ఈ సినిమా విషయంలో మౌనంగా ఉండాలనుకుందా.. అనేది అర్థం కావడం లేదు. నిజానికి మౌనంగా ఉండాలనుకుంటే మాత్రం 'చర్చలు జరుగుతున్నాయి' అనో.. లేదా 'ఆ విషయం నిర్మాతలే చెప్పాలి' అనో సమాధానాన్ని దాటేయాలి. అంతే కానీ, సినిమా చేయట్లేదంటే ఫ్యాన్స్ కన్ ఫ్యూజ్ అవుతారు కదా.. చిత్రబృందం మాత్రం తమ సినిమాలో ఇప్పటికీ కథానాయిక శ్రుతి హాసనే అంటోంది. మరి శ్రుతి ఈ డబుల్ గేమ్ ఎందుకు అడుతుందో ఆమెకే తెలియాలి.