గౌతమితో గొడవపై శ్రుతి స్పందించింది

Update: 2016-08-16 09:42 GMT
రెండు రోజులుగా చెన్నైలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. కమల్ కూతురు శ్రుతి హాసన్.. కమల్ హాసన్ కు అత్యంత సన్నిహితురాలైన గౌతమి మధ్య కాస్ట్యూమ్స్ విషయంలో పెద్ద గొడవ జరిగిందని.. ‘శభాష్ నాయుడు’ కోసం గౌతమి తనకు డిజైన్ చేసిన దుస్తులపై శ్రుతి హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని వార్తలు గుప్పుమన్నాయి.

ఈ గొడవపై మీడియాలు వలువలు చిలువులుగా వార్తలొస్తుండటంతో శ్రుతి హాసన్ నుంచి ఓ స్టేట్మెంట్ బయటికి వచ్చింది. ఆమె ప్రతినిధి దీనిపై వివరణ ఇచ్చారు. శ్రుతికి ఫ్యాషన్ మీద మంచి అవగాహన ఉందని.. ఓ సినిమాలో తాను ఎలా కనిపించాలనే విషయంలో ఆమెకు ఓ క్లారిటీ ఉందని.. ఈ విషయంలో దర్శకులు.. నిర్మాతలతోనూ ఆమె సంప్రదింపులు జరుపుతుందంటూ ముందు శ్రుతి గురించి ఓ ఉపోద్ఘాతం ఇచ్చారిందులో.

‘శభాష్ నాయుడు’ సినిమాలో శ్రుతి అమెరికా నుంచి ఇండియాకు వచ్చే యంగ్ గర్ల్ గా కనిపిస్తుందని.. డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ ఉండే అమ్మాయిగా ఈ పాత్రను దృష్టిలో ఉంచుకుని గౌతమి ప్రి ప్రొడక్షన్ దశలో కొన్ని దుస్తులు తెచ్చిందని.. ఈ విషయంలో గౌతమికి శ్రుతి సహకారం అందించి.. మరింత బెటర్ ఔట్ పుట్ కోసం ప్రయత్నించిందని ఇందులో పేర్కొన్నారు. అంతే తప్ప ఎక్కడా గొడవ జరిగిందని కానీ.. ఇద్దరి దుస్తుల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని కానీ చెప్పలేదు. దాని బదులు సైలెంటుగా ఉంటే ఆ వివాదం వార్తల్లోంచి దానంతట అదే వెళ్లిపోయేది. ఈ స్టేట్మెంట్ చూశాకే ఈ గొడవకు ఒక అథెంటిసిటీ వచ్చింది.
Tags:    

Similar News