సహనటుల విషయంలో ప్రభాస్ చూపించే ప్రేమ ఆప్యాయతల గురించి చెప్పాల్సిన పనిలేదు. అతను మంచి ఫుడ్ లవర్. ప్రభాస్ కి అత్యంత సన్నిహితంగా ఉండేవారికి వ్యక్తిగతంగా నాన్ వెజ్ క్యారేజీలు అందుతాయని చెబుతారు. ముఖ్యంగా తన కథానాయికలు సీనియర్ సహచరుల విషయంలో డార్లింగ్ అస్సలు తగ్గడు. తనతో కలిసి పనిచేసిన ఏ హీరోయిన్ అయినా ప్రభాస్ ఇంట నాన్ వెజ్ ఐటమ్స్ కచ్చితంగా రుచి చూపించాల్సిందే. ఆ విషయంలో డార్లింగ్ అస్సలు రాజీకి రారు. గతంలో శ్రద్ధా కపూర్..కంగన.. తమన్నా సహా పలువురు కథానాయికలకు డార్లింగ్ హాస్పిటాలిటీ గురించి అవగతమైంది. ఇటీవల బాలీవుడ్ సీనియర్ కథానాయికలు కరీనా కపూర్.. భాగ్యశ్రీ లాంటి వారికి ప్రభాస్ స్పెషల్ వంటకాల్ని రుచి చూపించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆన్ లొకేషన్ శ్రుతి హాసన్ ఎక్స్ పీరియన్స్ చేస్తోంది. ఇటీవలే ప్రభాస్ ఇంతకుముందు ప్రత్యేకంగా శ్రుతి హాసన్ కోసం నాన్ వెజ్ ఐటమ్స్ పంపించిన సంగతి తెలిసిందే. వాటిని రుచి చూసిన తర్వాత ఇంత రుచికరమైన ఫుడ్ ఎప్పుడూ తినలేదని శ్రుతి తెలిపింది. ఆ వంటకాల్ని చూస్తేనే కడుపు నిండిపోయిందని..తింటే ఇంకెలా ఉంటుందో చెప్పలేనని ఐటమ్స్ చూసిన వెంటనే శ్రుతి హాసన్ మనసులో మాట బయట పెట్టింది. ఇటీవల మరోసారి మంచి ఫుడ్ పంపిస్తానని డార్లింగ్ ఆఫర్ చేసారట. దీంతో శ్రుతి హాసన్ నావల్ల కాదు.. దయచేసి ఆ పనిమాత్రం చేయకండని చెప్పేసింది. పంపిన తర్వాత అంత రుచికరమైన ఫుడ్ ని ఎదురుగా చూస్తూ ఉండలేను. అసలే తక్కువ తినేదాన్ని..కానీ డార్లింగ్ పంపిచేసి చూస్తే మొత్తం లాంగించేయాలనిపిస్తుంది. అందుకే వద్దన్నా. అలా అనకపోతే సినిమా షూటింగ్ అంతా డిస్టర్బ్ అవుద్ది.. అంటూ శ్రుతి కంగారు పడింది.
మొదటిసారి ఫుడ్ పంపినప్పుడే తిన్న తర్వాత షూటింగ్ పై దృష్టిపెట్టలేకపోయానని తెలిపింది. దీంతో ప్రభాస్ ఫుడ్ కి బదులుగా కొన్ని డిజర్స్ట్ పంపించారట. అందులో మూడు రకాల డిజర్స్ట్ మాత్రం బాగా ఇష్టపడతానని శ్రుతి హాసన్ తెలిపింది. ప్రస్తుతం ప్రభాస్-శ్రుతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ముంబైలో శ్రుతి హోటల్లో డార్లింగ్ స్పెషల్ లేదా?
ఇటీవలే శ్రుతి హాసన్ ఆంధ్రా రుచులన్నింటిని రుచి చూస్తున్న సంగతి తెలిసిందే. `సలార్` షూటింగ్ సమయంలో ప్రభాస్ ఆంధ్రాలో ఫేమస్ అయిన అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలన్నింటిని తన చెఫ్ తో తయారు చేయించి శ్రుతి కి ఆన్ లొకేషన్ తినిపించడం శ్రుతి హాసన్ కి చాలా కొత్త ఎక్స్ పీరియన్స్. ఇంత టేస్టీగా వంటలు ఇంతవరకూ ప్రపంచంలోనే ఎప్పుడు ఎక్కడ తినలేదని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆ రకంగా ఆంధ్రా వంటల రుచేంటో శ్రుతి హాసన్ కి తెలిసొచ్చింది. ఇక తమిళనాడు సాంబర్ కూడా వరల్డ్ వైడ్ గా ఎంత ఫేమస్సో తెలిసిందే. మరి ఈ రుచులన్నింటినీ ఆరగించిన శ్రుతిహాసన్ మైండ్ లో బిజినెస్ ప్లాన్ కూడా ఉందిట. ఏకంగా ముంబైలో సౌత్ ఇండియన్ స్టైల్ రెస్టారెంట్ ని శ్రుతి ప్రారంభిస్తోంది. అయితే ఇందులో డార్లింగ్ స్పెషల్ అంటూ ఏదైనా వంటకం కస్టమర్లకు రుచి చూపిస్తే బావుంటుంది కదా!? అని ప్రభాస్ అభిమానులు సూచిస్తున్నారు. మరి శ్రుతి ఏమంటుందో?
ముంబైలో ఇలాంటి హోటల్ ప్రారంభించాలని ఎప్పటి నుంచో కలలు కంటోందిట. వంట చేయడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అందులోనూ వండి వడ్డించడం అంటే ఇంకా ఇష్టమట. ఈ మధ్య కాలంలో ఆకలిస్తే ప్రభాస్ వంటకాలు మాత్రమే గుర్తొస్తున్నాయని తెలిపింది. బిజినెస్ ప్రారంభిస్తే గనుక ఆంధ్రా పప్పు.. తమిళనాడు సాంబర్ తన హోటల్ మెనులో తప్పక ఉంటాయని తెలిపింది. మొత్తానికి ప్రభాస్ రుచులు శ్రుతిని ఇంతగా ప్రభావితం చేశాయన్నమాట.