సోషల్ మీడియాలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్డింగ్ విషయం ఉంటుంది. ట్రెండ్ అయ్యే విషయాలపై ఎక్కువగా సినీ ప్రముఖులు స్పందిస్తూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మరియు బిఫోర్ టెన్ ఇయర్స్ అంటూ ట్రెండ్ అవుతుంది. అందులో భాగంగా శృతి హాసన్ స్పందిస్తూ తన పది సంవత్సరాల క్రితం ఫొటోను షేర్ చేసింది. హీరోయిన్ గా శృతి హాసన్ ఎంట్రీ ఇవ్వక ముందు ఆమె కాస్త లావుగా ఉండటంతో పాటు, హెయిర్ స్టెల్ మరియు ఫేస్ కూడా డిఫరెంట్ గా ఉండేది. దాంతో అప్పటి ఫొటో ఇప్పుడు పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా జనాలు శృతి హాసన్ ను టార్గెట్ చేశారు.
పాత ఫొటోను శృతి హాసన్ పోస్ట్ చేసి - పది సంవత్సరాల క్రితం అంటూ కామెంట్ చేసింది. శృతి హాసన్ ఫొటోకు ఇష్టం వచ్చినట్లుగా జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదేమో అందుకే నీ మొహం కాస్త విభిన్నంగా కనిపిస్తుందని కొందరు, మరి కొందరు మరీ నీవు అప్పుడు ఇంత దారుణంగా ఉండేదానివా, సినిమాల్లోకి వచ్చేందుకు నువ్వు ఏం ఆపరేషన్స్ చేయించుకున్నావంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి శృతి హాసన్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో జనాలు చేస్తున్న కామెంట్స్ కొన్ని మరీ దారుణంగా ఉన్నాయి. ఏదో ట్రెండ్ అయ్యే విషయం కదా అని, పోస్ట్ చేస్తే తనకు ఇలా రివర్స్ అయ్యిందేంట్రా బాబోయ్ అనుకుంటూ శృతి హాసన్ అనుకుంటూ ఉంటుంది. శృతి హాసన్ గతంలో కూడా కొన్ని విషయాల్లో అతిగా స్పందించడం వల్ల విమర్శల పాలైన విషయం తెల్సిందే.