పిల్లల కోసం పెళ్లెందుకు??

Update: 2017-05-24 15:53 GMT
సౌత్ బ్యూటీ శృతి హాసన్ బోలెడంత డేరింగ్. యాక్టింగ్ లో ట్యాలెంట్ తో పాటు స్టేట్మెంట్స్ ఇవ్వడంలో మరీ సూటిగా మాట్లాడేస్తూ ఉంటుంది. కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడి కూతురు అయినా తన ప్రతిభతోనే ఈ స్థాయిని అందుకుందంటే అందులో శృతి కష్టం చాలానే ఉంది. అదే ఆమె ధీమా కూడా.

జీవితంపై నిశ్చితాభిప్రాయాలు ఉన్న ఈ సౌత్ బ్యూటీ.. తాజాగా తనపై వచ్చిన ప్రేమ-పెళ్లి వార్తలపై స్పందించింది. అసలు తనకు ఎవరినీ ప్రేమించే ఉద్దేశ్యం లేదని.. అంత సమయం కూడా లేదని చెప్పిన శృతి.. ఇప్పటికైతే ఎవరినీ ప్రేమించడం లేదని చెప్పింది. అలాగే పెళ్లి చేసుకునే విషయంలో కూడా తన నిర్ణయాన్ని సూటిగా చెప్పేసిన శృతి.. పిల్లల కోసం అయితే పెళ్లి చేసుకుని తీరాలనే రూల్ ఎక్కడా లేదంటూ షాక్ ఇఛ్చేసింది. గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ ని ప్రేమించానని చెప్పిన శృతి హాసన్.. అతనితో కలిసి చక్కర్లు కొట్టిన విషయాన్ని ఒప్పుకుంది.

అయితే.. విడిపోయిన తర్వాత అది ప్రేమ కాదని.. కేవలం ఆకర్షణ మాత్రమే అనే సంగతి అర్ధమయినట్లు చెప్పింది శృతి హాసన్. తన ప్రతీ అంశాన్నీ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని.. ఇందుకు తల్లిదండ్రుల నుంచి అనుమతితో పాటు ఆమోదం కూడా లభిస్తుందని నమ్మకంగా చెప్పింది శృతి హాసన్.
Tags:    

Similar News