ఈ ఏడాది శృతిహాసన్ కి ఓ రేంజ్ లో కలిసొచ్చేసింది. వెల్ కం బ్యాక్ తో బాలీవుడ్ లోను, శ్రీమంతుడితో టాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఒక్క విజయ్ పులి తప్ప వరుస హిట్స్ అన్నీ శృతి వైపు క్యూ కట్టేశాయి. దీంతో నిర్మాతలే కాదు.. బ్రాండ్ లు కూడా అమ్మడి దగ్గరకి వచ్చి వాలుతున్నాయి.
ఫ్యాంటా సాఫ్ట్ డ్రింక్ ఫాంటా యాడ్ లో శృతి యాక్ట్ చేసింది. ఈ కమర్షియల్ టీవీల్లో టెలికాస్టింగ్ ప్రారంభమైంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఇస్తున్నట్లుగానే.. కంపోజ్ చేసిన డ్యాన్స్ భలేగా ఉంది. యాడ్ అంతా శృతి మీదే ఫోకస్ చేసి తీయడం విశేషం. డ్యాన్స్ - స్టైలింగ్ - గెటప్ లతో అదరగొట్టేసింది శృతి. సౌత్ నుంచి వెళ్లి.. నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలక్ట్ కావడం.. అది కూడా కోకకోలా వంటి మల్టీ నేషనల్ కంపెనీకి సైన్ చేయడమంటే మామూలు విషయం కాదు. అమ్మడికిపే ఇప్పటికే తెలుగు - తమిళం - హిందీల్లో అనేక హిట్లు ఉండటమే ఇందుకు ప్లస్ అవుతోంది. పైగా అన్ని చోట్లా కూడా అమ్మడు సెక్స్ ఎప్పీల్ తో విపరీతమైన మాస్ ఎప్పీల్ ను సాధించేసిందిగా.. సో.. బ్రాండ్లన్నీ ఈమె వెంటనే పడుతున్నాయ్.
లాయిడ్ హోమ్ అప్లయన్సెస్ - ఫిలిప్స్ లైట్స్ - జ్యూవెల్ వన్ జ్యూవెలరీ స్టోరీ - షాపర్స్ స్టాప్ లకు కూడా శృతిహాసన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. చూస్తుంటే.. టాప్ బ్రాండ్స్ అన్నీ అమ్మడి ఇంటికి క్యూ కట్టేసేట్లుగా ఉన్నాయి. ఇక సోప్స్ - ఫెయిర్ నెస్ క్రీములే పెండింగ్. అవి కూడా వచ్చేస్తే.. యాడ్ ఎండార్సింగ్ లోనూ శృతి టాప్ రేంజ్ కి వెళ్లిపోయినట్లే.