రిలేష‌న్స్‌ను రివీల్ చేసిన శ్రుతి

Update: 2017-05-01 10:15 GMT
లోక‌నాయ‌కుడి కుమార్తె శ్రుతిహాస‌న్ ముచ్చ‌ట ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. కెరీర్ స్టార్టింగ్‌లో ఆమెను హీరోయిన్‌గా చూడ‌టానికి క‌మ‌ల్ వీరాభిమానులు చాలానే ఫీల‌య్యారు. అలాంటి వారి ఫీలింగ్స్ ను తాను గుర్తించిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన ఆమె.. ఎక్స్‌ పోజింగ్ విష‌యంలో జాగ్ర‌త్త‌గానే వ్య‌వ‌హ‌రించింది. అయితే.. ఇలానే సాగితే పోటీకి త‌ట్టుకొని నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మేన‌ని ఫీలై.. అందాల ఆర‌బోత‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఆ త‌ర్వాత నుంచి తెర మీద ఎంత‌లా చెల‌రేగిపోయిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

సినిమా సినిమాకు గ్లామ‌ర్ డోస్ పెంచేసిన శ్రుతి త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచేది. వారితో వీరితో.. రిలేష‌న్స్ ఉంటాయంటూ గాసిప్స్ వ‌చ్చేవి. వాటి మీద ఎప్పుడూ రియాక్ట్ కాలేదు శ్రుతి. ఆమెకు సిద్ధార్థ్‌.. ధ‌న‌నుష్‌.. రైనా ఇలా చాలామందితోనే లింకు పెట్టినా.. రియాక్ట్ అయ్యింది లేదు. అయితే.. తాజాగా ఆమె ఓ ఫారిన‌ర్‌ తో రిలేషన్‌ లో ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది శ్రుతి. త‌న పాత రిలేష‌న్స్ ను రివీల్ చేసిన ఆమె.. వాటికి బ్రేక‌ప్ చెప్ప‌టానికి కార‌ణం ఏమిట‌న్న విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పేయ‌టం విశేషం.

త‌న‌కు ప‌ని మీద‌నే ఎప్పుడు దృష్టి పెడుతుంటాన‌ని.. అయితే.. అది అవ‌త‌లివారికి న‌చ్చేది కాద‌ని.. ఆ విష‌యంలో అభ్యంత‌రం పెడితే.. తాను వారి నుంచి దూరం అయ్యేదానిన‌ని వెల్ల‌డించింది. మ‌న‌తో పాటు మ‌న ప‌నిని కూడా ఇష్ట‌ప‌డేవారినే భాగ‌స్వామిగా ఎంచుకోవ‌టం లైఫ్ లో చాలా కీల‌మ‌ని వ్యాఖ్యానించిన శ్రుతి.. త‌న బ్రేక‌ప్స్ గురించి క్లారిటీ ఇచ్చిన‌ట్లుగా చెప్ప‌క  త‌ప్ప‌దు. బ్రేక‌ప్స్ గురించి కాస్తంత క్లారిటీ ఇచ్చిన‌ప్ప‌టికీ.. ప్ర‌జంట్ ఎఫైర్ గురించిమాత్రం మాట వ‌ర‌స‌కు కూడా నోరు విప్ప‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News