మాస్ రాజా ఐడియా అదిరిందిగా!

Update: 2019-06-03 06:34 GMT
సీనియర్ హీరోలందరికీ కామన్ గా ఉన్న సమస్య ఏంటంటే వారికి సరైన జోడీగా కనిపించే హీరోయిన్లను వెతకడం.  ఈ సమస్య ముఖ్యంగా 50 ఏళ్ళ పై ఉన్న హీరోలందరికీ ఉంది.  స్టార్ హీరోయిన్లు ఈ సీనియర్ స్టార్ల సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించరు.  కొత్త హీరోయిన్లు కొందరు రెడీ అవుతారు కానీ జోడీ సరిగా ఉండదు. దీంతో మన సీనియర్ స్టార్లు నయనతార లాంటి హీరోయిన్లను తీసుకోవాల్సి వస్తుంది.  కానీ అలాంటి హీరోయిన్ల డేట్స్ దొరకడం కష్టం.. పైగా రెమ్యూనరేషన్ ఎక్కువ. అంతెందుకు సీనియర్ స్టార్ సినిమా అనగానే సాధారణ హీరోయిన్లు కూడా డబల్ రెమ్యూనరేషన్ చెప్తున్నారట.  ఈ సమస్యలు మాస్ రాజా రవితేజకు కూడా ఉన్నాయి.  అందుకే మాస్ రాజా దీనికి పరిష్కారం కనిపెట్టాడని టాక్ వినిపిస్తోంది

ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వీరితో పాటు రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లు కొందరు ఉన్నారు.. మాస్ రాజా ఇలాంటివారిపై దృష్టి సారించాడట. వీరిలో గతంలో తనతో నటించిన హీరోయిన్లనే పరిశీలిస్తున్నాడట. రీసెంట్ గా 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా లో ఇలియానా డీ క్రజ్ తో రవితేజ జోడీ కట్టిన సంగతి తెలిసిందే.  తాజాగా శృతి హాసన్ తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడట.  రవితేజ తన కొత్త సినిమాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు.  ఈ సినిమాకోసమే శృతి హాసన్ ను తీసుకున్నారని సమాచారం.

రవితేజ 'బలుపు' సినిమాలో శృతిహాసన్ తో రొమాన్స్ చేశాడు.  ఇప్పుడు మరోసారి శృతితో కలిసి నటిస్తున్నాడు.  శృతి ఈమధ్యే సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది.  తమిళంలో విజయ్ సేతుపతితో 'లాబం' అనే సినిమా చేస్తోంది.  మరో రెండు మూడు తమిళ ఆఫర్లు కూడా చేతిలో ఉన్నాయట. ఇప్పుడు రవితేజ సినిమాతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది.  రవితేజ హీరోయిన్ల స్ట్రేటజీ వర్క్ అవుట్ అయితే మిగతా సీనియర్ స్టార్లు కూడా ఇదే పధ్ధతి ఫాలో అవుతారేమో. అలా జరిగితే ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లకు భారీ డిమాండ్ ఏర్పడడం ఖాయమే.

    

Tags:    

Similar News