ఈ మధ్యే ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ గురించి తెగ ఫీలైపోయింది సీనియర్ హీరోయిన్ శ్రియ. ఇలాంటి యాడ్స్ చేయడం కరెక్ట్ కాదని ఆమె వ్యాఖ్యానించింది. ఐతే శ్రియనే స్వయంగా ఇంతకుముందు రెండు ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ చేయడం గమనార్హం. అవి చేసినందుకు ఇప్పుడు చింతిస్తున్నానని అందామె. ఐతే అవకాశాలు వచ్చినపుడు చేసేసి.. ఇప్పుడు పని లేనపుడు ఇలాంటి కామెంట్లు చేయడం విడ్డూరం అంటూ శ్రియ మీద సెటైర్లు వేస్తున్నారు జనాలు. ఐతే బాలీవుడ్లో కంగనా రనౌత్ లాంటి వాళ్లు ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. వాటికి నో అంటే నో అంటారు. ఈ జాబితాలో చేర్చాల్సిన సౌత్ హీరోయిన్ శ్రుతి హాసన్. ఆమె కూడా ఈ ఫెయిర్ నెస్ క్రీమ్.. ఆల్కహాల్ యాడ్స్ కు తాను పూర్తి వ్యతిరేకం అంటోంది.
‘‘రంగు పెరగడానికి ఏదైనా ఫెయిర్ నెస్ క్రీమ్ సజెస్ట్ చేయమని నన్నెవరైనా అడిగితే.. అస్సలు చెప్పను, రంగు తక్కువ ఉన్నాం అనుకోవడంలో ఉన్న బాధేంటో నాకు తెలుసు. చిన్నపుడు నాకూ ఇదే ఫీలింగ్ ఉండేది. నేను ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ను ప్రమోట్ చేయను. నా చిన్నప్పటిలాగా ఇప్పుడు నేను రంగుకి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రంగు తక్కువగా ఉన్నామని ఎందుకు బాధపడాలి? అందుకే ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఫెయిర్ నెస్ క్రీమ్స్ ప్రకటనలు చేయను. అందం అంటే చర్మం రంగు మీద ఆధారపడి ఉండదు. అలాగే ఆల్కహాల్ ప్రకటనలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా చేయను. ఎందుకంటే మద్యం ఆరోగ్యానికి హాని చేస్తుంది'' అని చెప్పింది శ్రుతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/