శ్రుతి హాసన్ మరో పేరు.. బెండకాయక్కా

Update: 2017-03-23 09:53 GMT
బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయిని చాలామంది అంటుంటారు. ఇది తరతరాలుగా ఉన్న నమ్మకం. ఎవరైనా లెక్కల్లో బలహీనంగా ఉంటే బెండకాయలు తినమని అంటుంటారు. అవి తింటే తెలివితేటలు పెరుగుతాయని.. ముఖ్యంగా గణితంలో రాణిస్తారని అంటుంటారు. ఈ విషయం తాను కూడా బలంగా నమ్మేదాన్నని.. లెక్కల్లో వీక్ కావడంతో బెండకాయలు తెగ తినేసేదాన్నని అంటోంది స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్.

స్కూల్లో చదువుకునే రోజుల్లో లెక్కలు బాగా రావాలని ప్రతి రోజూ బెండకాయలు తినేదట శ్రుతి. తన తల్లి ఈ రోజు ఏం వంట చేయాలని అడిగినా బెండకాయలనే చెప్పేదట. తనకు బెండకాయల మీద ఉన్న మక్కువ చూసి.. అందరూ ఆమెను ‘వెండకాక్కా’ (తెలుగులో బెండకాయక్కా అని అర్థం) అని పిలిచేవాళ్లట. ఐతే తాను అంతగా బెండకాయలు తిన్నా పెద్దగా ఫలితం లేకపోయిందని శ్రుతి తెలిపింది.

తనకు స్కూల్ డేస్ లో గణితంలో అత్యధికంగా వచ్చిన మార్కులు వందకు 26 మాత్రమే అని.. ఒకసారి మరీ అన్యాయంగా 2 మార్కులు మాత్రమే వచ్చాయని శ్రుతి వెల్లడించింది. ఈ మార్కులు చూశాక లెక్కలు బాగా రావాలంటే కష్టపడి చదవాలి తప్ప.. బెండకాయలు తింటే లాభం లేదని తేలిందని.. అప్పట్నుంచి వాటిని వదిలిపెట్టానని శ్రుతి తెలిపింది. ఇప్పటికీ తాను లెక్కల్లో వీకే అని శ్రుతి చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News