నేను మారా.. పవన్ మారలేదు

Update: 2017-03-22 07:43 GMT
ఐదేళ్ల కిందట ‘గబ్బర్ సింగ్’ చేసే సమయానికి.. ఇప్పుడు ‘కాటమరాయుడు’ చేస్తున్న సమయానికి తనలో చాలా మార్పు వచ్చిందని.. కానీ అప్పటికి ఇప్పటికి పవన్ కళ్యాణ్ మాత్రం పెద్దగా మారలేదని అంటోంది శ్రుతి హాసన్. ‘కాటమరాయుడు’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ టైంలో పవన్ శ్రుతి గురించి మాట్లాడిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో పవన్ గురించి శ్రుతి ఏమందంటే..

‘‘పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు సినిమాల కంటే సొసైటీ గురించి ఆయన ఆలోచన.. ఆయన తపన గుర్తుకొస్తాయి. ఆయన సొసైటీ పట్ల ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. ఎప్పుడూ జనాల గురించే ఆలోచిస్తుంటారు. దాని గురించి నాతో మాట్లాతుంటారు. ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎప్పుడో చేసినట్లుంది. అప్పటికి ఇప్పటికి నేను చాలా మారాను. కానీ పవన్ మాత్రం అలాగే ఉన్నారు. అలాగే మాట్లాడుతున్నారు. ‘గబ్బర్ సింగ్’ చేయడానికి ముందు నా మీద నాకే ఎన్నో సందేహాలున్నాయి. అప్పుడు నేను తెలుగులో సినిమాలు చేయాలా.. తమిళం మీద ఫోకస్ చేయాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ సినిమా తర్వాత నా దశ తిరిగింది. పవన్ కళ్యాణ్ గారు నా కెరీర్ ను మలుపు తిప్పారు. ఆయన యునీక్ పర్సన్. పవన్ తక్కువ మాట్లాడతారు. కానీ మంచి విషయాలే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇది ప్రత్యేకమైన సందర్భం. ఆయన ఇంకో 20 ఏళ్లు ఇండస్ట్రీలో కొనసాగాలని కోరుకుంటున్నా’’ అని శ్రుతి చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News