ఛాన్స్‌ ఇస్తా రాత్రికి వస్తావా అన్నాడు

Update: 2019-04-05 11:46 GMT
బాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌, లైంగిక వేదింపులు ఉన్నాయని వెళ్లడయ్యింది. రంగుల ప్రపంచం వెనుక చీకటి గాధలు ఎన్నో ఉన్నాయని మీటూ ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత తెలుస్తుంది. మీటూ ఉద్యమంలో భాగంగా ఎంతో మంది ప్రముఖుల బండారాలు బయటకు వస్తున్నాయి. ఎంతో మంది ఇండస్ట్రీకే దూరం అవుతున్నారు. తాజాగా మరో హీరోయిన్‌ తాను ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి సోషల్‌ మీడియా ద్వారా సుదీర్ఘ పోస్ట్‌ పెట్టి తన బాధను అంతా షేర్‌ చేసుకుంది.

బాలీవుడ్‌ తో పాటు తమిళం మరియు కన్నడంలో నటించిన హీరోయిన్‌ శృతి మరాతే కెరీర్‌ ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా పేర్కొంది. తన 16 ఏళ్ల వయసులోనే బాలీవుడ్‌ లో అడుగు పెట్టాను. ఆ సమయంలో నాకు అదృష్టం కొద్ది అవకాశాలు వచ్చాయి. ఒక సినిమాలో బికినీ వేసుకోమని అడిగితే తాను వెంటనే ఓకే చెప్పాను. అయితే షూటింగ్‌ సమయంలో బికినీ వేసుకున్న తర్వాత నాకు చాలా ఇబ్బంది అనిపించింది. షూట్‌ ఎలా చేస్తారో తెలియక బికినీ వేసుకునేందుకు ఒప్పుకున్నాను అంది.

ఇక ఒక దర్శకుడు సినిమాలో ఆఫర్‌ ఇచ్చి, కథ చర్చలకు పిలిచాడు. ఆఫర్‌ ఓకే అయ్యింది, షూటింగ్‌ మొదలు పెట్టాల్సి ఉండగా ఆ దర్శకుడు నాతో ఒక రాత్రికి వస్తావా, ఈ సినిమాలో నీవే హీరోయిన్‌ అన్నాడు. అప్పుడు మరి హీరో వద్దకు ఎవరిని పంపిస్తున్నావు అంటూ నేను ప్రశ్నించాను. ఆ ప్రశ్నకు అతడు షాక్‌ అయ్యాడు. అతడి కోరిక తీర్చేందుకు నేను ఒప్పుకోలేదు, ఆ ప్రాజెక్ట్‌ నుండి నన్ను తొలగించారు.

శృతి పోస్ట్‌ కు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఆధరణ దక్కింది. ఆమెకు మద్దతుగా చాలా మంది కామెంట్స్‌ చేస్తున్నారు. జరిగిన అన్యాయంను ధైర్యంగా చెప్పుకునేందుకు వచ్చిన శృతిని అభినందిస్తున్నారు.

Tags:    

Similar News