వియ్ లవ్ బ్యాడ్ బోయ్స్.. అంటూ టాలీవుడ్ లో సందడి చేసింది ముంబై బ్యూటీ శ్వేతా భరద్వాజ్. బిజినెస్ మేన్ లో అదరగొట్టే ఐటెమ్ నంబర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట్రడ్యూస్ చేసిన భామగా శ్వేతా కెరీర్ జెట్ స్పీడ్ అందుకోవడం ఖాయం అని భావించారంతా. అయితే ఈ అమ్మడు అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.
డ్యాన్సుల పరంగా, ఎక్స్ ప్రెషన్ పరంగా శ్వేతా భరద్వాజ్ లో లోటుపాట్లేవీ లేవు. పెర్ఫామెన్స్ కి చక్కని రెస్పాన్స్ వచ్చినా ఆశించిన అవకాశాలు మాత్రం రాలేదు. పూరి పరిచయం చేసిన ముమైత్ రేంజులో ఎదిగే ఛాన్సుందనుకుంటే .. అస్సలు ఛాన్సులే రాలేదు. పూరీ ఐటెమ్ భామల్లో ముమైత్ కి వచ్చినన్ని ఛాన్సులు .. వేరొక ఐటెమ్ భామ అందుకోకపోవడం విశేషం. అదే తీరుగా శ్వేతాకి కూడా అవకాశాలు రాలేదు. ఇక టాలీవుడ్ మర్చిపోయింది అనుకుంటున్న టైమ్ లో ఇప్పుడు మరోసారి తెలుగు తెరపై సందడి చేసే ఛాన్సొచ్చింది అమ్మడికి.
గోపిచంద్ హీరోగా ఏ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ అమ్మడిని రంగంలోకి దించుతున్నారు. ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉన్న సౌఖ్యం మూవీలో శ్వేతా ఓ అదిరిపోయే ఐటెమ్ నంబర్ చేయబోతోందని సమాచారం. అనూప్ రూబెన్స్ ఇప్పటికే ఈ ఐటెమ్ నంబర్ ట్యూన్ రెడీ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే ఐటెమ్ నంబర్ ని చిత్రీకరించనున్నారు. ఇప్పటికైతే శ్వేతా భరద్వాజ్ కి సరైన రీఎంట్రీ దొరికినట్టే. మరి ఇప్పుడైనా అదృష్టం కలిసొస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.