మొదటి నుంచి కూడా నాని విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. కథాకథనాల పరంగా .. వసూళ్ల పరంగా సినిమా ఎలా ఉన్నా, తన పాత్రకి న్యాయం చేసే విషయంలో ఆయన ఎప్పుడూ కూడా తక్కువ మార్కులు తెచ్చుకోలేదు. ఇక కొంతమంది హీరోలు ఒక సినిమా చేస్తుంటే అది మాస్ కి దగ్గరగా ఉందా? క్లాస్ కి దగ్గరగా ఉందా? అని ఆడియన్స్ చూస్తారు . నాని సినిమా అయితే మాత్రం అది ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా అనేసి ఫిక్స్ అవుతారు. అంతగా ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు.
నాని ఈ మధ్య గ్రామీణ నేపథ్యంలో .. ఉమ్మడి కుటుంబం చుట్టూ తిరిగే 'టక్ జగదీష్' సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ కాకపోయినా .. మరీ తీసికట్టుగా కూడా ఏమీ ఉండదు. ఫరవాలేదు అనే అనిపించుకుంది. అలాంటి నాని నుంచి ఆ తరువాత సినిమాగా 'శ్యామ్ సింగ రాయ్' రానుంది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. చారిత్రక అంశంతో ముడిపడిన ఈ కథ .. కలకత్తా నేపథ్యంలో జరుగుతుంది. ఆనాటి కాస్ట్యూమ్స్ .. హెయిర్ స్టైల్ .. మీసకట్టుతో నాని డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.
ఇప్పటికే ఆయన లుక్ కి మంచి మార్కులు పడిపోయాయి. ఇక ఈ సినిమాలో సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ ముగ్గురి లుక్స్ కూడా బయటికి వచ్చాయి. వీరు ఏయే సందర్భాల్లో కథానాయకుడికి దగ్గరవుతారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అయిష్టం .. అసహనం .. కోపం కలిగిన కృతి శెట్టి లుక్ అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. జిషు సేన్ గుప్తా - మురళీ శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
ఓ పదిహేనేళ్లు వెనక్కి వెళ్లి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తరచి చూసుకుంటే, తన లైఫ్ కి చాలా దగ్గరగా 'శ్యామ్' పాత్ర కనిపిస్తుందని నాని అన్నాడు. అందువల్లనే తాను ఆ పాత్రకి అంతగా కనెక్ట్ కాగలిగానని చెప్పాడు. ఈ సినిమాలో తన పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుందనీ .. డైలాగ్స్ చాలా లెన్తీగా ఉంటాయని అన్నాడు. అయినా డైలాగ్స్ లో ఉండే పవర్ .. డెప్త్ ప్రేక్షకులకు నచ్చుతాయని చెప్పాడు. ఈ సినిమాలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయనీ, తన కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని అన్నాడు. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.