కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి ట్వీట్ అర్థాన్ని ఊహించుకుంటారు. అలాంటి ఊహకు తెరతీసేలా హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ప్రకంపనాలకు తెర తీసింది. నాగచైతన్య- సమంత విడిపోతున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత హీరో సిద్ధార్థ్ .. ఊహించని విధంగా అతను తన టీచర్ల నుండి నేర్చుకున్న మొదటి పాఠం గురించి ట్వీట్ చేసాడు. ``ఛీటర్స్ నెవర్ ప్రోస్పర్`` అనేది ఈ ట్వీట్ సారాంశం. సరిగ్గా ఏడెనిమిదేళ్ల క్రితమే సమంతతో సిద్ధార్థ్ బ్రేకప్ అంటూ మీడియా కథనాలొచ్చిన క్రమంలో అప్పట్లోనే ఇలాంటి ఒక ట్వీట్ చేశారు సిద్ధార్థ్. దాని గురించి తమిళ మీడియాలో చాలా కథనాలొచ్చాయి. ఇప్పుడు కూడా అదే ట్వీట్ ని రిపీట్ చేయడంతో ఇది సామ్ ని ఉద్ధేశించే అని అంతా ఊహిస్తున్నారు.
సిద్ధార్థ్ చేసిన తాజా ట్వీట్ సమంతపై విరుచుకుపడే ఉద్ధేశమేనని ఇప్పుడు చాలామంది భావిస్తున్నారు. సిద్ధార్థ్ - సమంత అప్పట్లో రిలేషన్ లో ఉన్నారని పుకార్లు వచ్చాయి. కానీ ఆ ఇద్దరూ ఏనాడూ దానిని అంగీకరించలేదు. మీడియా ఎదుటే ఆ పుకార్లను ఇద్దరూ ఖండించారు. కానీ కోలీవుడ్ టాలీవుడ్ మీడియాల్లో నిరంతర కథనాలు వెలువడడం ఆగలేదు. తాజాగా హీరో సిద్ధార్థ్ తన ట్వీట్ పై స్పందించారు. ఇది ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్నారు. ప్రతిరోజూ నేను నా మనసులో ఉన్నది ఏదైనా ట్వీట్ చేస్తాను. నేను వీధి కుక్కల గురించి ట్వీట్ చేస్తే.. అది వారిని ఉద్దేశించినది అని.. ప్రజలు ఎవరైనా తమని ఉద్ధేశించి అనుకుంటే నేను బాధ్యత వహించను`` అని సిద్ధార్థ్ అన్నారు.
దీనిని బట్టి ఎవరికి వారు ఊహించుకోవద్దని సిద్ధార్థ్ క్లారిటీనిచ్చినట్టే అయ్యింది. తన ట్వీట్లను అవాంఛిత వివాదాల్లోకి లాగవద్దని .. అలాగే వాటిని పెద్దదిగా చేయవద్దని మీడియాను సిద్ధార్థ్ అభ్యర్థించారు. ``నా జీవితంలో కోరుకోని వ్యక్తుల కంటే నా జీవితం గురించి నేను ఎక్కువ ఆందోళన చెందుతున్నాను. కాబట్టి మీడియా పుకార్లపై కూడా స్పందించడానికి నేను ఇష్టపడను`` అని సిద్ధార్థ్ తెలిపారు. సిద్ధార్థ్ నటించిన తెలుగు చిత్రం మహా సముద్రం ఈనెల 14న విడుదలవుతోంది. కొంత గ్యాప్ తర్వాత అతడు తిరిగి తెలుగు సినిమాలో నటించారు.