తమ సినిమాకు అన్యాయంగా ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారని దర్శక నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేయడం చూస్తుంటాం. కానీ ‘గృహం’ సినిమా హీరో కమ్ ప్రొడ్యూసర్ సిద్దార్థ్ మాత్రం తన సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్టే ఇవ్వమని.. ఇంకేదీ వద్దని సెన్సార్ బోర్డును స్వయంగా తనే రిక్వెస్ట్ చేసుకున్నాడట. ఈ రోజు హైదరాబాద్ లో ‘గృహం’ సినిమా ప్రెస్ ప్రివ్యూ అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో సిద్దార్థే ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘గృహం’ లాంటి హార్రర్ సినిమాను పిల్లలు, ఫ్యామిలీస్ చూస్తాయని భావిస్తున్నారా అని సిద్ధును అడిగితే.. వాళ్లు ఈ సినిమా చూడొద్దనే తాను గట్టిగా చెబుతున్నానని సిద్ధు అన్నాడు.
‘‘అన్ని సినిమాలూ కుటుంబంతో కలిసి చూడాల్సిన అవసరం లేదు. కుటుంబంతో కలిసి వెళ్లడానికి ఇది గుడి కాదు. సినిమా. ‘గృహం’ లాంటి హార్రర్ సినిమాలు చూడటానికి వేరే ప్రేక్షకులు ఉంటారు. 18 ప్లస్ వాళ్లే ఈ సినిమా చూడాలి. పిల్లలు అస్సలు చూడకూడదు. అలాగే హార్ట్ పేషెంట్లు, ముసలివాళ్లు కూడా ఈ సినిమా చూడొద్దనే కోరుకుంటున్నా. అలాంటి వాళ్లు ఇందులో ఉన్న హార్రర్ ఫ్యాక్టర్ కు తట్టుకోలేరు. అందుకే ఈ సినిమాకు సెన్సార్ వాళ్లను ‘ఎ’ సర్టిఫికెటే ఇవ్వమని అడిగాను. మా సినిమాలో ఓ చిన్నమ్మాయి కూడా నటించింది. మేం ప్రివ్యూ షో వేస్తే తన తల్లితో కలిసి ఆ అమ్మాయి కూడా వచ్చేసింది. నేను వాళ్లమ్మను తిట్టి పంపించేశాను. ఇక ఈ సినిమాలో రొమాన్స్ పాళ్లు కూడా ఎక్కువే ఉంటాయి. కానీ ఫ్యామిలీస్ రొమాన్స్ చూడటంలో తప్పేం లేదు. మనకు రొమాన్స్ నేర్పించేదే పెద్దవాళ్లు. మరి వాళ్లు రొమాంటిక్ సీన్స్ చూస్తే తప్పేంటి’’ అని సిద్ధు అన్నాడు.