ఓ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక ఇండస్ట్రీలోని ప్రముఖులకు చూపించి ఒపీనియన్ తీసుకోవడం మామూలే. కానీ సినిమా విడుదల కావడానికి కొన్న నెలల ముందే సాధారణ ప్రేక్షకులకు సినిమా చూపించాలంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. సిద్దార్థ్ హీరోగా అతడి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘గృహం’ సినిమా విషయంలో ఆ చిత్ర బృందం ఇలాగే చేసిందట. ఈ చిత్రాన్ని ఓ ప్రివ్యూ థియేటర్లో 200 మంది ప్రేక్షకులకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారట. సినిమా చూసిన వాళ్లు చెప్పిన అభిప్రాయాలు.. సూచనల ఆధారంగా మళ్లీ మార్పులు చేర్పులు చేసి.. ఆ తర్వాత ఫస్ట్ కాపీ తీసినట్లు వెల్లడించాడు సిద్దార్థ్.
ఈ ప్రివ్యూ పూర్తయ్యాక థియేటర్ ఆపరేటర్ చెప్పిన మాటలు ఈ సినిమాకు సంబంధించి తనకు దక్కిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అని సిద్దార్థ్ తెలిపాడు. సినిమా చూసిన అనంతరం టాయిలెట్ కు వెళ్లే ముందు ఓ వ్యక్తిని వెంట తీసుకువెళ్లినట్లు ఆపరేటర్ తనకు చెప్పాడని సిద్దార్థ్ తెలిపాడు. అంతే కాక సినిమా చూసి భయంతో ప్రేక్షకులు పదే పదే ఊగడంతో సీట్లు లూజ్ అయిపోయాయని.. దీంతో మళ్లీ అన్ని సీట్లను బిగించాల్సి వచ్చిందని కూడా ఆ వ్యక్తి తనకు చెప్పినట్లు సిద్ధు తెలిపాడు. ఒక సినిమా తీసిన వాళ్లకు ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్ ఏం కావాలని సిద్ధు అన్నాడు. ఇంతకుముందు తాను నటించిన ‘బొమ్మరిల్లు’ సినిమా క్లైమాక్స్ విషయంలోనూ తాను ప్రేక్షకుల్లో ఇలాంటి స్పందనే చూశానని సిద్ధార్థ్ చెప్పాడు.