తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు.. ఏళ్లపాటు సాగిన మొగలిరేకులు సీరియల్ ని ఎలా మర్చిపోలేరో.. అందులో ఆర్కే నాయుడు పాత్రలో నటించిన సాగర్ ని అంతకంటే మర్చిపోలేరు. చక్రవాకం.. రుతురాగాలు వంటి సీరయల్స్ లో ట్యాలెంట్ చూపిన ఈ బుల్లితెర హీరో సాగర్ కి సినిమాల్లో సత్తా చాటాలనే కోరిక చాలా ఏళ్ల నుంచే ఉంది. గతంలో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో హీరో ఫ్రెండ్ పాత్రలో కూడా కనిపించాడు.
ఇప్పుడు సాగర్ మెయిన్ స్ట్రీమ్ హీరోగా నటించిన సినిమా ఒకటి విడుదలకు సిద్ధమవుతోంది. సిద్ధార్ధ అనే టైటిల్ పై రూపొందిన సినిమాతో హీరో కావాలనే తన కోరిక నెరవేర్చుకుంటున్నాడు సాగర్. అలాగని ఇదేమీ చిన్న సినిమా కాదు.. ఏదో చేసేశామన్నట్లుగా కూడా సాగర్ చేయలేదు. మొన్న విడుదలైన సిద్ధార్ధ ట్రైలర్ ను చూస్తే పక్కా స్టోరీతో పాటు చాలా ఇంటెన్సిటీతో ఈ మూవీ తీశారనే విషయం అర్ధమవుతుంది. ఐడెంటిటీ మార్చుకుని బతికేసే పోష్ హీరో.. మట్టుపెట్టేందుకు వెతికేసే విలన్ గ్యాంగ్.. మధ్యలో లవ్ స్టోరీ.. కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ సిద్ధార్ధలో పక్కాగానే కనిపిస్తున్నాయి.
ఫిలిం ఇండస్ట్రీకి ఈ హీరో కొత్తే అయినా.. టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైన వాడే కావడం కలిసొచ్చే విషయంగా చెప్పచ్చు. మరోవైపు ఈ మూవీ వర్క్ చేసిన వాళ్లంతా సీనియర్లు కావడం విశేషం. పరుచూరి బ్రదర్స్ రచన.. మణిశర్మ సంగీతం.. ఎస్ గోపాల్ రెడ్డి ఫోటోగ్రఫీ.. ప్రవీణ్ పూడి- ఎడిటింగ్.. దాసరి కిరణ్ నిర్మాణం.. సిద్ధార్ధను పెద్ద సినిమా చేసేశాయని చెప్పాలి. ఇంత పెద్ద బలగం వెనుకనే ఉన్నప్పుడు ఖచ్చితంగా హిట్టు కొట్టాలి. మరి బుల్లితెర నాయుడు సక్సెస్ అవుతాడా??
Full View