దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చింది సైమా. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పేరిట జరిగే ఈ వేడుకకి మంచి క్రేజ్ వుంది. విదేశాల్లో జరిగే ఈ వేడుకకి టాప్ స్టార్స్ హాజరవడమే కాకుండా వాళ్లంతా పర్ ఫార్మెన్సులు ఇస్తూ అదరగొడుతుండటంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. దీంతో యేటికేడు మరింత పెద్ద వేడుక అవుతూ వస్తోంది సైమా. నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ సినిమా సంబరం ఈసారి సింగపూర్ లో జరగబోతోంది.
చివరి సారిగా దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి జూన్ 30 - జులై 1న రెండు రోజులపాటు సింగపూర్ లో సైమా - 2016ని జరపడానికి ఏర్పాట్లు చేశారు. నాలుగు పరిశ్రమలకి చెందిన వంద మంది స్టార్స్ ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారట. 12 అదిరిపోయే ప్రదర్శనలు ఏర్పాటు చేశారట. అందులో శ్రుతిహాసన్ - రకుల్ ప్రీత్ - రెజీనా - హ్యూమా ఖురేషి లాంటి భామలు ఆడిపాడబోతున్నారట. ఈ విషయాలన్నీ తెలియజేయడానికి సింగపూర్ లో సమావేశం ఏర్పాటు చేసింది సైమా బృందం.
ఈసారి మరింత గ్రాండ్ గా సైమా జరగబోతోందని స్పష్టం చేసింది. సైమా సక్సెస్ ఫుల్ గా జరగడం చూసి గతేడాది ఐఫా కూడా సౌత్ కి తరలి వచ్చింది. చూస్తుంటే బాలీవుడ్ తరహాలోనే సౌత్ ఇండియాలో కూడా భారీ ఎత్తున అవార్డు వేడుకలు జరిగేలా కనిపిస్తున్నాయి.