తమిళ కథానాయకుడు శింబు తన మాజీ ప్రేయసి నయనతార పై ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి కంప్లైట్ చేశాడన్న వార్తలు దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో హాట్ టాపిక్ గా మారాయి. రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఆ విషయం గురించే చర్చ. దీనిపై ఎట్టకేలకు శింబు స్వయం గా స్పందించాడు. "నయనతారపై నేను కేసు పెట్టడమా ఛ ఛ... అలాంటిదేమీ లేదు, మేమంతా ఒక ఫ్యామిలీ" అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇద్దరూ కలిసి చాలా రోజుల తర్వాత 'ఇదు నమ్మ ఆళు' అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్రం కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఇంతలో నయనతార నిర్మాతలకి ఇచ్చిన కాల్షీట్లన్నీ వృథా అయిపోయాయి. ఇప్పుడు మళ్లీ సినిమా షూటింగ్ రమ్మని పిలిస్తే ఆమె నో చెబుతోందట. ఇదివరకు ఇచ్చిన కాల్షీట్లు వృథా చేసుకొన్నారు కాబట్టి కొత్తగా కాల్షీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పిందట. ఆ విషయంపై నిర్మాతలకీ, నయనతార కీ మధ్య గొడవ జరిగిందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ గొడవలో కి కథానాయకుడు శింబు కూడా తలదూర్చి నిర్మాతల పక్షాన నిలిచాడని, సినిమా కంప్లీట్ చేయడాని కి రాకపోతే ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేస్తామని నయన్‌ని హెచ్చరించినట్టు సమాచారం. కొద్దిమందైతే ఫిర్యాదు కూడా చేశాడని చెప్పుకొన్నారు. ఆ వార్త ఆ నోట ఈ నోట పాకి శింబుకి కూడా చేరింది. ఆయన వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'ఇదు నమ్మ ఆళు'కి సంబంధించి వినిపిస్తున్నవన్నీ పుకార్లేననీ, ఆ సినిమా అనుకొన్నట్టుగానే విడుదలయ్యి తీరుతుందని, ఎవరినో బ్లేమ్ చేయడం, ఎవరిపైనా ఫిర్యాదు చేయడంలాంటివన్నీ అబద్ధాలనీ చెప్పుకొచ్చాడు. శింబుకి అంతా బ్యాడ్ పీరియడ్ ఇది. మొన్నటిదాకా 'వాలు' సినిమా విడుదల విషయంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. సుధీర్ఘకాలం పోరాటం ఆ తర్వాత ఆ సినిమాని విడుదల చేయించాడు. ఇప్పుడు 'ఇదు నమ్మ ఆళు' విషయంలో ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నాడు.