తొలి తెలుగు జేమ్స్ బాండ్ చిత్రం 'గూఢచారి 116'... తొలి తెలుగు కౌబాయ్ చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు'... తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం 'అల్లూరి సీతారామరాజు'... ఇలాంటి మొట్ట మొదటి ట్రెండ్ సినిమాలను అందించిన సూపర్ స్టార్ కృష్ణ తొలి తెలుగు 70 ఎం.ఎం 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ తో స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'సింహాసనం' చిత్రం మార్చి 21న 1986లో విడుదలై ఘనవిజయం సాధించింది. అంతేకాదు... మొదటి వారం 1 కోటి 51 లక్షల 65 వేల 291 రూపాయలు కలెక్ట్ చేసి ఆల్‌టైమ్ స్టేట్ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేసారు. అత్యంత భారీ సెట్స్ వేసి హైదరాబాద్ పద్మాలయా స్టూడియోలో - హోగినికల్‌లో - మైసూర్ తదితర ప్రాంతాల్లో ఈ చిత్రాన్నితెరకెక్కించారు. జానపద చిత్రాల్లోనే సరికొత్త ఒరవడిని సృష్టించిన 'సింహాసనం' ఓపెనింగ్స్ పరంగా ఆ రోజుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించడమే కాకుండా శతదినోత్సవం - రజతోత్సవం జరుపుకుంది. వైజాగ్ చిత్రాలయలో 100 రోజులు హౌస్ ఫుల్స్ తో ప్రదర్శింపబడింది. విజయవాడ రాజ్ లో కంటిన్యూస్ గా 53 రోజులు ఫుల్స్ అయింది. అలాగే డైరెక్ట్ గా 16 కేంద్రాల్లో 50 రోజులు, 6 సెంటర్స్ లో 100 రోజులకు పైగా ప్రదర్శింపబడింది. హైదరాబాద్ దేవి థియేటర్ లో రోజూ 4 ఆటలతో 105 రోజులు ఆడింది. ఈ చిత్రం శతదినోత్సవాన్నిచెన్నైలోని విజిపి గార్డెన్స్ లో వేలాది అభిమానుల మధ్య నిర్వహించారు. అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం ఈ జనసందోహాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
తెలుగులో 'సింహాసనం', హిందీలో 'సింఘాసన్' పేర్లతో రెండు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం 60 రోజుల్లోనే రూపొందించబడింది. వి.ఎస్.ఆర్.స్వామి ఛాయా గ్రహణం, భాస్కరరాజు కళా దర్శకత్వం, సి.మాధవరావు మేకప్, శీను నృత్య దర్శకత్వం, వీరు దేవగన్ ఫైట్స్ 'సింహాసనం' చిత్రాన్ని టెక్నికల్ గా పెద్ద రేంజ్ కి తీసుకెళ్ళాయి. విక్రమసింహగా - ఆదిత్య వర్దనుడుగా సూపర్ స్టార్ ద్విపాత్రాభినయం అభిమానుల్ని ఎంతగానో అలరించింది. జి.హనుమంతరావు - జి.ఆదిశేషగిరిరావుల నిర్వహణలో పద్మాలయా స్టూడియోస్ బేనర్ పై కృష్ణ... కథ-స్క్రీన్‌ప్లే-ఎడిటింగ్ బాధ్యతలతో స్వీయ దర్శకత్వంలో 'సింహాసనం' చిత్రాన్ని తెరకెక్కించాడు. బప్పీలహరి సంగీతం అందించారు. అప్పట్లో మ్యూజికల్ గా పెద్ద హిట్ అయింది. ఇప్పటికీ 'ఆకాశంలో ఒకతార నా కోస మొచ్చింది ఈవేళ', 'వాహ్వా నీ యవ్వనం', 'గుమ్మా గుమ్మా ముద్దుగుమ్మ' పాటలు ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తుంటాయి.
రచయిత మహారథి ఈ చిత్రానికి మాటలు రాయడమే కాకుండా ఓ పాత్ర పోషించారు. తెలుగులో హిందీ నటుడు అంజాద్ ఖాన్ నటించిన తొలి చిత్రం ఇదే. కృష్ణ సరసన జయప్రద, రాధ, మందాకిని హీరోయిన్స్‌గా నటించగా వహీదా రెహమాన్ - గుమ్మడి - ప్రభాకర్‌రెడ్డి - కాంతారావు - గిరిబాబు - సత్యనారాయణ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగులో తొలి 70 ఎం.ఎం. చిత్రంగా అఖండ ప్రజాదరణ పొందిన 'సింహాసనం' విడుదలై 30 ఏళ్ళు పూర్తయింది.