ఈ సంవత్సరం ప్రారంభం అయినప్పటి నుండి కూడా బాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అమీర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’, సల్మాన్ ఖాన్ ‘రేస్ 3’, షారుఖ్ ఖాన్ ‘జీరో’ ఇంకా ప్రముఖ స్టార్స్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. ముగ్గురు సూపర్ స్టార్స్ కూడా ఈ ఏడాది డిజాస్టర్స్ ను చవి చూడటంతో పాటు ఇంకా ఎన్నో సినిమాలు కూడా కథ అడ్డం తిరిగి చతికిల పడ్డాయి. ఈ సంవత్సరం ఫ్లాప్ లతోనే బాలీవుడ్ ముగించబోతుందని భావిస్తున్న సమయంలో సింబా సినిమాతో రణ్ వీర్ సింగ్ హిందీ ప్రేక్షకులకు సక్సెస్ మూవీని అందించాడు.
బాలీవుడ్ కు ఈ సంవత్సరం సక్సెస్ ముగింపును ఇచ్చింది తెలుగు సినిమా రీమేక్ అవ్వడం విశేషం. తెలుగు సూపర్ హిట్ మూవీ ‘టెంపర్’ కు రీమేక్ గా వచ్చిన ‘సింబా’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుని వంద కోట్ల క్లబ్ లో జాయిన్ కాబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సారా అలీఖాన్ ఈ చిత్రం సక్సెస్ ఇచ్చింది. తెలుగులో ఎన్టీఆర్ స్థాయిలో రణ్ వీర్ సింగ్ నటించలేదనే టాక్ వచ్చినా కూడా హిందీ ప్రేక్షకులు ‘టెంపర్’ సినిమాను గురించి ఆలోచించకుండా ‘సింబా’ను సక్సెస్ చేశారు.
‘సింబా’ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు ఏమీ లేవు. రీమేక్ అంటూ కొందరు తేలికగా తీసుకున్నారు. అయితే విడుదల తర్వాత పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు, ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా కలెక్షన్స్ ఊపందుకున్నాయి. మొదటి రోజు 20 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసిన ఈ చిత్రం తర్వాత రోజుల్లో కూడా మంచి వసూళ్లను దక్కించుకుంటుంది. 2018 సంవత్సరాన్ని ‘సింబా’ మూవీ సక్సెస్ తో ముగించడంతో బాలీవుడ్ వర్గాల వారు పరువు నిలిచిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.