పుష్పక విమానం - విచిత్ర సోదరులు అలాగే భైరవ ద్విపం - ఆదిత్య 369.. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను మనకు అందించిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన గురించి అందరికి తెలిసే ఉంటుంది. అప్పట్లో కేవీ.రెడ్డి గారి లాంటి మహా గొప్ప దర్శకుల దగ్గర శిష్యుడిగా చేసిన ఆయన మాయ జార్ మ్యాజిక్ ను బాగానే అలవాటు చేసుకున్నారు. గురువుగారి దగ్గర నేర్చుకున్న ట్రిక్స్ ఆయన సినిమాల్లో బాగా కనిపిస్తుంటాయి.
అయితే ఇటీవల వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటి లో ఆయన యువకుడిగా ఉన్న పాత్రను తరుణ్ భాస్కర్ ద్వారా చూసే అవకాశం అందరికి దక్కింది. అప్పట్లో ఎలా ఉండే వారు అనే విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ బాగా తెలుసుకొని మాయాబజార్ షూటింగ్ లోని ఒక సన్నివేశాన్ని అద్భుతంగా చూపించాడు. గ్లిజరిన్ పగిలిపోయింది అని చెప్పడం కేవీ.రెడ్డి గారు కోప్పడటం. ఆ తరువాత సావిత్రి షూటింగ్ సక్సెస్ అయ్యేలా చేసి అందరి చేత క్లాప్స్ కొట్టించుకుంది.
ఇక సింగీతం శ్రీనివాసరావు అప్పట్లో సావిత్రి గారి సినిమాలకు బాగానే వర్క్ చేసినా ఎప్పుడు ఆమెతో ఒక ఫొటో కూడా దిగలేదు. ఇక ఫైనల్ గా ఆమెతో ఫొటో కుదరకపోయినా ప్రస్తుతం మహానటి గా కనిపించి అందరి హృదయాలను గెలుచుకున్న కీర్తి సురేష్ తో ఫొటోకి స్టిల్ ఇచ్చారు. అందరు సావిత్రి గారితో ఒక్క ఫొటో కూడా దిగలేదా అని అడిగారు. అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు కుదిరిందని సింగీతం చెప్పడం విశేషం. ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్ కీర్తి గారికి రాలేదని చెప్పాలి.