ఆమె పాడిన పాట‌కు శ్రియ ఘోష‌ల్ పేరేశార‌ట‌

Update: 2017-04-10 09:17 GMT
సింగ‌ర్ ప్ర‌ణ‌విని ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. మిగిలిన యూత్ సింగ‌ర్స్ తో పోల్చిన‌ప్పుడు ఆమె వాయిస్ కాస్త గ‌మ్మ‌త్తుగా ఉంటుంది. పెద్ద‌గా మాట్లాడ‌న‌ట్లుగా క‌నిపించే ప్ర‌ణ‌వి.. మిగిలిన సింగ‌ర్స్ తో పోలిస్తే.. వార్త‌ల్లో త‌ర‌చూ క‌నిపిస్తుంటుంది. దీనికి త‌గ్గ‌ట్లే కొరియోగ్రాఫ‌ర్ ర‌ఘుతో ల‌వ్ ఎపిసోడ్‌.. మ్యారేజ్ చేసుకోవ‌టం లాంటివి కూడా కార‌ణం. తాజాగా ఆమె.. త‌న భ‌ర్త‌తో క‌లిసి ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూ సంచ‌ల‌నంగా మారింది. సింగ‌ర్స్ విష‌యంలో నిర్మాత‌లు వ్య‌వ‌హ‌రించే అంశాల్ని ఆమె ఓపెన్ గా విప్పి చెప్పింది.

సింగ‌ర్స్ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంద‌ని.. త‌న‌కు ఒక్కో పాట‌కు రూ.5వేలు మాత్ర‌మే పారితోషికం ఇస్తున్నార‌ని.. కొన్ని సంద‌ర్భాల్లో పాట‌కు రూ.3వేల‌కు మించి కూడా ఇవ్వ‌ని సంద‌ర్భాలున్నాయ‌ని చెప్పారు. ప్ర‌ణ‌వి లాంటి సింగ‌ర్స్ కు ఇచ్చే పారితోషికం ఇంత త‌క్కువ‌గా ఉంటాయా? అని షాక్ తినే ప‌రిస్థితి.

తాజాగా నెల‌కొన్న డిమాండ్ కార‌ణంగా.. కొత్త వాళ్లు అయితే ఫ్రీగా పాడేందుకు సైతం సిద్ధ‌మైపోతున్నారు. పాట పాడాన‌న్న ఫేం కోసం ఫ్రీగా పాడేందుకు సైతం సై అంటున్నార‌ట‌. దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాత‌లంటూ అస‌లుగుట్టును విప్పేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తానుపాడిన‌పాట‌కు శ్రియాఘోష‌ల్ పాడిన‌ట్లుగా పేరు వేసేసిన ఉదంతాలు ఉన్నాయంటూ ఆమె చెప్పిన మాట‌లు షాకింగ్ గా మారాయి. అయితే.. ఇదంతా త‌న అనుమ‌తితోనే జ‌రిగింద‌ని కూడా చెప్పారు. అలా త‌న పేరు కాకుండా శ్రియ పేరు వేసే స‌మ‌యంలో త‌న‌కిచ్చే రెమ్యున‌రేష‌న్ ఎక్కువ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తాన‌ని చెప్పింది.

ఇలా రెమ్యున‌రేష‌న్ గురించి.. ఒక‌రు పాడితే మ‌రొక‌రి పేరు వేయ‌టం గురించి ప్ర‌ణ‌వి చెప్పిన మాట‌ల‌పై చాలానే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంద‌రైతే.. ప్ర‌ణ‌వి బోల్డ్ గా ఓపెన్ అయ్యింద‌ని చెబితే.. మ‌రికొంద‌రు మాత్రం ఫేం కోసం కాసిన్ని అతిశ‌యోక్తులు క‌ల్పించి చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌ లో పాట‌కు రూ.5వేలు అంటే ఓకే కానీ.. మ‌రీ ఇప్పుడుకూడా అంతే మొత్తానికి పాడుతుంద‌న్న మాటలో నిజం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్పుడు వినిపించింది సింగ‌ర్ వాయిస్ మాత్ర‌మే.. ఎవ‌రైనా నిర్మాత కూడా ఇదే స్థాయిలో ఓపెన్ అయితే.. అప్పుడు అస‌లు విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌ట‌మే కాదు.. లెక్క‌ల విష‌యం మ‌రింత క్లారిటీ వ‌చ్చే వీలుంది. నిజానికి అలాంటి అవ‌కాశం ఉంటుందా? అన్న‌దే ప్ర‌శ్న‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News