సింగిల్ స్క్రీన్లు క‌లెక్ష‌న్స్ దెబ్బేస్తున్నాయా?

Update: 2020-02-19 16:30 GMT
సంక్రాంతి పందెంలో భారీ చిత్రాలు చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించిన సంగ‌తి తెలిసిందే. అల వైకుంఠ‌పుర‌ములో- స‌రిలేరు నీకెవ్వ‌రు బ్లాక్ బస్ట‌ర్ హిట్స్ సాధించాయి. అయితే వీటికి పండ‌గ సంద‌ర్భంతో పాటు సెల‌వులు బాగా క‌లిసొచ్చాయి. స్కూల్స్ కాలేజ్ విద్యార్థులు థియేట‌ర్ల‌కు క్యూక‌ట్ట‌డం క‌లిసొచ్చింది. మ‌ల్టీప్లెక్స్ ల‌తో పాటుగా సింగిల్ స్క్రీన్లు క‌ళ‌క‌ళ‌లాడ‌డంతో బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ అదిరాయి. అయితే ఆ త‌ర్వాత రిలీజైన సినిమాలు మాత్రం దారుణ ఫ‌లితాన్ని ఎదుర్కొన్నాయి.

స్టార్ డ‌మ్ ఉన్న తార‌లు తెర‌పై క‌నిపించినా కానీ ఎందుక‌నో క‌లెక్ష‌న్ల పరంగా దారుణ‌మైన ప‌రిస్థితి క‌నిపించింది. అయితే దీనికి కార‌ణ‌మేమిటి? అన్న‌ది ట్రేడ్ విశ్లేషిస్తే చాలా సంగ‌తులే తెలిసాయి. వాస్త‌వానికి ఇటీవ‌లి కాలంలో మ‌ల్టీప్లెక్సుల్లో ఉన్న క‌లెక్ష‌న్స్ సింగిల్ స్క్రీన్ల‌లో ఉండే ప‌రిస్థితి లేదు. థియేట్రిక‌ల్ బిజినెస్ ని సింగిల్ స్క్రీన్స్ బాగా ప్ర‌భావితం చేస్తున్నాయ‌ని తెలుస్తోంది. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న టాక్ వ‌స్తే కానీ జ‌నం సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం లేదు. దాంతో అవి వెల‌వెల పోతున్నాయి. పైగా తొలి మూడు రోజుల త‌ర్వాత థియేట‌ర్ల స‌న్నివేశం మ‌రీ అయోమ‌యంగా ఉంటోందిట‌.

అందుకే జ‌నం రాని థియేట‌ర్ల‌ను ఇప్ప‌టికే క‌ల్యాణ మండ‌పాలుగా మార్చేసార‌న్న టాక్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేట‌ర్లు ఇప్ప‌టికే క‌ల్యాణ మండ‌పాలుగా మారిపోయాయి. వాటిని తిరిగి తెరిపించే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేదు. యావ‌రేజ్ అన్న టాక్ వ‌స్తే సోమ‌వారం నుంచి థియేట‌ర్లు ఖాళీనే. క‌లెక్ష‌న్స్ ప‌రంగా దారుణ‌మైన డ్రాప్ క‌నిపిస్తుండ‌డంతో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి ఉంది. క‌రెంట్ బిల్లులు.. మెయింటెనెన్స్ బిల్లులు అయినా రాక‌పోతే సింగిల్ స్క్రీన్ల‌లో సినిమా ఆడించ‌లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనిపై ఎగ్జిబిట‌ర్లు చాలా కాలంగానే ఘొల్లుమంటూనే ఉన్నారు. సంక్రాంతి త‌ర్వాత విడుద‌లైన ర‌వితేజ - శ‌ర్వానంద్ - స‌మంత‌- విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి స్టార్ల సినిమాలు సైతం చ‌తికిల‌బ‌డిపోయాయంటే స‌న్నివేశం ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. సంక్రాంతి మెమ‌రీస్ ని ఈ రిజ‌ల్ట్ చాలా బ్యాడ్ గా మార్చేసిన‌ట్ట‌య్యింది.
Tags:    

Similar News