పద్మశ్రీ అందుకున్న శాస్త్రి గారు

Update: 2019-03-16 14:49 GMT
ఎన్నో తెలుగు సినిమాకు తన కలంతో ప్రాణం పోసి తెలుగు లెజెండ్రీ రచయితగా పేరు దక్కించుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి కేంద్ర ప్రభుత్వం మొన్న గణతంత్ర దినోత్సవం సందర్బంగా పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం తెల్సిందే. దేశంలోనే నాల్గవ అత్యున్నత అవార్డు అయిన పద్మశ్రీ అవార్డు తెలుగు సినిమా రచయితకు రావడంతో తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం హర్షం వ్యక్తం చేసింది. నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా శాస్త్రిగారు ఆ అవార్డును అందుకున్నారు.

నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ లో ప్రముఖుల సమక్షంలో - కుటుంబ సభ్యుల సమక్షంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన శాస్త్రిగారికి పద్మ అవార్డు రావడం తెలుగు సినిమా పరిశ్రమకు సంతోషకర విషయం అంటూ సినీ ప్రముఖులు ఈ సందర్బంగా స్పందించారు.

సిరివెన్నెల అనే సినిమాతో రచయితగా సీతారామశాస్త్రి పరిచయం అయ్యారు. ఆ సినిమాలోని ప్రతి పాట కూడా ఆణిముత్యం మాదిరిగా నిలిచి పోయింది. అందుకే ఆ సినిమానే ఇంటి పేరుగా మార్చుకుని సిరివెన్నెల సీతారామశాస్త్రిగా నిలిచి పోయారు. పలు అవార్డులు, బిరుదులు అందుకున్న ఆయనకు ఇప్పుడు పద్మశ్రీ అవార్డు మరింత గౌరవంను పెంచింది.
Tags:    

Similar News