గ్రీకువీరుడు.. సిసింద్రీ.. వరుణ్‌ తేజ్‌

Update: 2015-09-17 17:45 GMT
ఒక హీరోను కంపేర్‌ చేయాలంటే.. పక్క హీరోల సినిమాల పేర్లు వాడతారా? అందరూ వాడేరేమో కాని, అందరికీ పాటలు రాసిన సీతారామ శాస్ర్తి గారు మాత్రం వాడేస్తారు. అదే ఆయన స్పెషాలిటీ. చెప్పేదేదో సూటిగా చెప్పేయడమే ఆయన లక్షణం. అందుకే మెగా ఫంక్షన్‌ లో ఓ రెండు అక్కినేని పాటలు వినిపించాయి. పైగా అవన్నీ యంగ్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ను పొగిడేయటానికే.

''వరుణ్‌ తేజ్‌ ను చూస్తుంటే ఓ విషయం చెప్పాలి. నాకు నేను రాసిన ఓ రెండు పాటలు గుర్తొస్తున్నాయి. గ్రీకువీరుడు, నా రాకుమారుడు.. ఇదొకటి.. మరొకటి సిసింద్రీ.. చిన్నితండ్రీ నిన్ను చూడక వేయి కళ్ళయిన సరిపోవురా.. ఈ రెండూ వరుణ్‌ కు కరక్టుగా ఆప్ట్‌. కేవలం అందం ఉన్న స్టార్‌ మాత్రమే కాదు, గట్స్‌ ఉన్న యువకుడు వరుణ్‌. అందుకే ఈ కథను ఎంచుకున్నాడు.. ఇంటికి వెళ్లాక తన తల్లి చేత, చెల్లి చేత దిష్టి తీయించు నాగబాబు...'' అంటూ కంచె ఆడియో ఫంక్షన్‌ లో కుర్రాడిని ఆకాశానికి ఎత్తేశారు సిరివెన్నెల.

ఆ రెండు పాటలూ కూడా ఆయనే రాశారు మరి. కాబట్టి ఆయన రాసిన పాటలను ఆయనే వాడుకొని ఇలా మెగా హీరోను పాగిడేయటం బాగానే ఉంది. ఇకపోతే ఆ పాటల్లో ఒకటి తండ్రి నాగ్‌ ది అయితే, రెండోది కొడుకు అఖిల్‌ ది. ఇదో విశేషం మరి.
Tags:    

Similar News