బాలు 'జ్ఞాపకాలతో పార్కు' చెన్నైలో ఏర్పాటు

Update: 2020-12-14 09:46 GMT
గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళిగా తమిళనాడుకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ ‘ ఎస్​పీబీ వనం’ పేరిట ఓ పార్కును నిర్మించబోతున్నది. బాలూ తెలుగువాడే అయినప్పటికీ తమిళ ప్రజల గుండెల్లోనూ చోటు సంపాదించుకున్నారు. మొదట్లో మద్రాసులోనే తెలుగు సినిమాలు తీసేవారు కావడంతో చాలా మంది సినీ నటులు, వివిధ విభాగాలకు చెందిన టెక్నిషియన్లు చెన్నైలోనే ఉండేవారు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. బాలూ కూడా మద్రాస్ లోనే స్థిరపడ్డారు. బాలు తెలుగులో వేల పాటలు పాడి ఎలా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారో తమిళంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి అక్కడి ప్రజలకు ఆరాధ్యదైవమయ్యారు.

గత సెప్టెంబర్​ నెలలో ఆయన కరోనా బారినపడి మనల్ని విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ తో తెలుగు సినీ ప్రముఖులు ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదు. కారణాలు ఏవైనప్పటికీ ఈ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను జరిపింది.

ఆంధ్రప్రదేశ్​ నుంచి మంత్రి అనిల్​కుమార్​ హాజరై నివాళి అర్పించారు. అయితే ఏపీ ప్రభుత్వం బాలూకు ఘన నివాళి అర్పించింది. ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. అయితే ఇప్పుడు తమిళనాడుకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ ఎస్​పీ బాలు జ్ఞాపకాలతో ఓ పార్కును నిర్మించబోతున్నది. 74 ఏళ్ల వయస్సులో బాలూ మృతిచెందారు. అందుకనే ఈ పార్కులో 74 మొక్కలు నాటబోతున్నారు. ఒక్కోమొక్కకు బాలు పాడిన ఓపాట పేరు పెట్టబోతున్నారు. అంతేకాక ఈ పార్కులో ఓ లైబ్రరీని ఇతర వసతులను ఏర్పాటుచేయబోతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ‘ సిరు తుళి’ అనే స్వచ్చంద సేవా సంస్థ ‘ ఎస్​పీబీ వనాన్ని ఏర్పాటు చేయబోతున్నది. 1.8 ఎకరాల స్థలంలో ఈ పార్కును ఏర్పాటుచేయబోతున్నారు.
Tags:    

Similar News