సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్. ఒక మాస్ సినిమా తీసేటప్పుడు ఈ మూడు పక్కాగా ఉండాలి. అప్పుడే అందరూ ఆ సినిమాని చూసేందుకు ఇష్టపడతారు. శ్రీనువైట్ల ఆ విషయాల్లో పక్కాగా ఉంటారు. తాను తీసే ప్రతీ చిత్రంలోనూ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త ఎక్కువపాళ్లు ఉన్నట్టు కనిపించినా... హీరోల స్థాయికి తగ్గట్టు యాక్షన్‌ని జోడించడం మాత్రం అస్సలు మరిచిపోరు. ఆ మాటకొస్తే సెంటిమెంట్ కూడా బలంగానే ఉంటుంది. ఇప్పుడు మరోసారి అలా అన్ని దినుసులూ వేసి పక్కాగా చరణ్ సినిమా స్క్రిప్టుని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. చెర్రీ ఇప్పటిదాకా చేసిన చిత్రాలు వేరు, శ్రీనువైట్లతో చేసే 'మై నేమ్ ఈజ్ రాజు' చిత్రం వేరు అని కథ గురించి తెలిసిన మెగా కాంపౌండ్ వర్గాలు అంటున్నాయి.
విశ్వసనీయ సమాచారం మేరకు 'మై నేమ్ ఈజ్ రాజు' కథలో సిస్టర్ సెంటిమెంట్ ఉందట. ఇక యాక్షన్ విషయానికొస్తే రామ్‌చరణ్ సినిమాలో స్టంట్‌మాస్టర్ పాత్రను పోషిస్తున్నారట. ఇక క్యారెక్టరే స్టంట్ మాస్టర్ అయితే యాక్షన్‌కి కొదవేముంటుంది? ఇక వినోదం సంగతికొద్దాం. వెటకారానికి పెట్టింది పేరు శ్రీనువైట్ల. దానికి తోడు ఆ పార్ట్‌పై బలంగా కాన్సంట్రేట్ చేసే శ్రీనువైట్ల ఆస్థాన రచయితలు కోన వెంకట్, గోపీమోహన్ కూడా టీమ్‌లో జాయిన్ అయ్యారు. ఒకప్పటి మిత్రబృందమంతా మళ్లీ ఒక్కటై సినిమాని పక్కాగా వండుతున్నారు. అలాంటప్పుడు వినోదానికీ లోటుండదని తెలిసిపోయింది. మొత్తంగా చూస్తే శ్రీనువైట్ల పక్కాగా ప్లాన్ చేసుకొని రంగంలోకి దిగినట్టు అర్థమవుతోంది. పైగా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్టు తీయాల్సిన సమయమిది. ఆ రకంగా చూసుకొన్నా మెగాఫ్యాన్స్ హ్యాపీగా నిద్రపోవచ్చు.