ఇటీవల మన ఫిలింమేకర్స్ రెండు ముఖ్యమైన విషయాల్ని పరిగణనలోకి తీసుకుని సినిమాలు తీస్తున్నారు. ఒకటి తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆడినా ఆడకపోయినా ఓవర్సీస్ డాలర్లు కొల్లగొట్టడం చాలా ఇంపార్టెంట్ అని భావిస్తున్నారు. డిజిటల్ డబ్బింగ్ రైట్స్ లో ఓ పట్టు పట్టగలిగినా కొంతవరకూ సేఫ్ అవ్వొచ్చు అన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అప్ కం హీరోల విషయంలో బయ్యర్లు.. పంపిణీదారులు తెలివైన గేమ్ ఆడుతున్నారు. హీరోల డిమాండ్ ఎంత? రిలీజవుతున్న థియేటర్ల ప్లేస్ మెంట్ వగైరా దృష్టిలో ఉంచుకుని బెట్టింగ్ కి పాల్పడుతున్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కాజల్ జంటగా నటించిన `సీత` ఈనెల 24న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు రిలీజ్ కుదరదు అంటూ వివాదాలు ముసురుకుంటున్నా మేకర్స్ మరోవైపు రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు చేస్తుండడం ఆసక్తికరం. తాజా సమాచారం ప్రకారం.. ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని మొత్తం 60 లొకేషనల్లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి గ్రేట్ ఇండియా ఫిలింస్ సంస్థ ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తోంది. ఇక ఈ సినిమాకి అనవసర హైప్ క్రియేట్ చేయలేని సన్నివేశంలో స్థాయికి తగ్గ రేట్లకే తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లోనూ హక్కుల్ని కట్టబెట్టారని చెబుతున్నారు. చాలా చోట్ల ఏకే సంస్థనే స్వయంగా రిలీజ్ చేస్తుండడంపైనా చర్చ సాగుతోంది.
మరోవైపు ఈ సినిమా శుక్రవారం (రేపు) రిలీజ్ కి రెడీ అవుతుంటే ప్రీబుకింగ్స్ రూపంలో పంచ్ పడింది. సీత సినిమాకి టిక్కెట్ విండో వద్ద ఊహించినంత ఊపు లేదని ఆన్ లైన్ టికెటింగ్ చెబుతోంది. ప్రస్తుతం అందరూ ఎలక్షన్ రిజల్ట్ మూడ్ లో ఉన్నారు. టీవీలకు అతుక్కుని ఏ ఫలితం ఎటువైపు? అంటూ ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రభావం సీతపై పడింది. సీతకు టిక్కెట్లు తెగడం లేదని అర్థమవుతోంది. ఒకవేళ రిలీజై హిట్టు అన్న టాక్ తెచ్చుకుంటే తప్ప ఊపు కనిపిస్తుందా.. లేదా? అన్నది చెప్పలేం.