సితార ఘ‌ట్ట‌మ‌నేని.. మ‌రో ఖాన్ డాట‌ర్ లా?

Update: 2022-12-22 15:50 GMT
బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్  క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషీ క‌పూర్ తో క‌లిసి జోయా అక్త‌ర్ రూపొందిస్తున్న ది ఆర్చీస్ (ఇండియా వెర్ష‌న్‌) లో న‌టిస్తోంది. వీరంతా చూస్తుండ‌గా క‌ళ్ల ముందే ఎదిగేసిన స్టార్ కిడ్స్. ఇంత‌లోనే టీనేజీ ద‌శ‌లో క‌థానాయిక‌లుగా తొలి అడుగులు వేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. స్టార్ అవ్వాలంటే ఎలాంటి బ‌జ్ కావాలో దానిని ఎలా క్రియేట్ చేయాలో నేర్వ‌డంలో వీళ్ల‌కు స‌రిలేరెవ్వ‌రూ!

కానీ ఇప్పుడు న‌ట‌వార‌సురాళ్లంద‌రినీ త‌ల‌దన్నేలా ప‌దేళ్ల సితార చేస్తున్న విన్యాసాలు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. అచ్చు గుద్దిన‌ట్టు సూప‌ర్ స్టార్ మ‌హేష్ రూపంతో క‌నిపించే సితార క్యూట్ లుక్స్ స్మైల్ తో ఇప్ప‌టికే గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. సితార ఇప్ప‌టి నుంచే క్లాసిక్ డ్యాన్స్ ని ప్రాక్టీస్ చేస్తోంది. అప్పుడ‌ప్పుడు వీలున్న‌ప్పుడ‌ల్లా సినీ గ్లిజ్ ని ఎలివేట్ చేసేలా డాడీ న‌టించిన‌ కొన్ని హిట్ పాట‌ల‌కు డ్యాన్సులు చేస్తూ అల‌రిస్తోంది. సీతా పాప‌కు అన్నీ తానే అయ్యి న‌మ్ర‌తా మ‌హేష్ శిక్ష‌ణ‌నిస్తున్నారు.

మ‌రోవైపు సోషల్ మీడియాల్లో సితార‌కు అసాధార‌ణ‌ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.  సితార ఘట్టమనేని ఇప్పటికే అక్కడ పెద్ద‌ స్టార్. తన తాజా పోస్ట్ తో దాన్ని మళ్లీ నిరూపించింది. ఇదిగో ఇలా కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా బేబీ పింక్ బార్బీ ప్రిన్సెస్ లా ప్ర‌త్య‌క్ష‌మైంది.
 
అనుకోకుండా సీతా పాప జన్మించింద‌ని కానీ ఇప్పుడు త‌మ ఇంటికి వెలుగులు తెచ్చిన క్యూటీ సితార అంటూ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో న‌మ్ర‌త ఉప్పొంగిపోయారు. సితార‌ లేకుండా తమ జీవితం చాలా అసంపూర్ణం అని కూడా అన్నారు.

సితార ఇన్ స్టాలో లేటెస్ట్ బార్బీ లుక్ తో పాటు బ్లాక్ డ్రెస్ లో ఎక్స్ ప్రెస్సివ్ లుక్ తో డ్యాన్సులు చేస్తున్న ఓ వీడియో కూడా అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. స్టార్ కిడ్ స్టార్ వైబ్స్ బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌న్న వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. సితార ఘ‌ట్ట‌మ‌నేని కూడా ఖాన్ డాట‌ర్ సుహానా లా క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేయ‌డం ఖాయ‌మ‌ని కూడా మ‌హేష్ అభిమానులు గెస్ చేస్తున్నారు.

అయితే సితార ఏమ‌వుతుంది? అన్న ప్ర‌శ్న‌కు న‌మ్ర‌త నుంచి కానీ మ‌హేష్ నుంచి కానీ ఇంకా ఆన్స‌ర్ అయితే లేదు. సితార ఏజ్ 10.. కానీ త‌న ప‌రిణ‌తి 20 అని ఇన్ స్టా ఫీడ్ వీక్షిస్తే ఎవ‌రైనా ఇట్టే గ‌మ‌నించ‌గ‌ల‌రు. ఆ ప‌రిణ‌తి కోసం ఎంతో శిక్ష‌ణ ఇస్తున్నారు త‌న గురువులు.. మామ్ డాడ్!  ప్ర‌స్తుతం గౌతమ్ - సితార విద్యాభ్యాసం గురించే త‌ల్లిదండ్రుల‌ త‌ప‌న‌. గౌత‌మ్ స్కూల్ ద‌శ నుంచే న‌ట‌న‌లో ఓన‌మాలు దిద్దుకుంటున్నాడు. కాలేజ్ ద‌శ‌లో పూర్తి స్థాయి న‌ట‌శిక్ష‌ణ‌ను పూర్తి చేస్తాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News