సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఎప్పుడు కూడా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఆమె ఇన్ స్టా లో ఏ పోస్ట్ షేర్ చేసినా.. ఏ స్టోరీ పెట్టినా కూడా లక్షల మంది చూస్తారు.. వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఆమె ఎక్కువగా తన తండ్రి మహేష్ బాబుతో ఉన్న ఫొటోలు మరియు వీడియోలను ఇంకా తన స్నేహితులతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
మొట్ట మొదటి సారి సితూ పాప తన తాత సూపర్ స్టార్ కృష్ణతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. గతంలో సితార మరియు కృష్ణల కాంబోలో కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. కాని ఈ ఫొటోలు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉన్నాయి అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కృష్ణ మరియు ఆయన తమ్ముడితో కలిసి సితార లంచ్ చేసింది. ఇద్దరు తాతలతో సీతూ పాప చేసిన సందడి ఈ ఫొటోల్లో కనిపిస్తుంది. సహజంగానే తాత మనవరాలి మద్య బంధం.. అనురాగం ఉంటుంది. సూపర్ స్టార్ మరియు సూపర్ ప్రిన్సెస్ ల మద్య ఆ బంధం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ తాత అంటూ కృష్ణ ను సితార పేర్కొంది. లవ్ యు సో మచ్ తాత గారు మరియు చిన తాత గారు అంటూ సితార పోస్ట్ చేసింది. ఇద్దరు తాతలతో ఉన్న సితూ పాప ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
సితార చిన్నప్పటి నుండే సోషల్ మీడియాలో చాలా సందడి చేస్తూ ఉండేది. మహేష్ బాబు కూతురు అవ్వడం వల్ల అందరి దృష్టి ఆమెపై ఉండేది. ఆమె బయట కనిపించిన ప్రతి సారి కూడా చిన్నప్పటి నుండే ఆమె వీడియోలు మరియు ఫొటోలు వైరల్ అవుతూనే ఉండేవి. ఇప్పుడు ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు సొంతంగానే టచ్ లో ఉంటుంది.
ఆమె తన సొంత యూట్యూబ్ ఛానల్ ను ప్రమోట్ చేసుకుంటూ మరో వైపు తన వ్యక్తిగత విషయాలను తన తండ్రి మరియు స్నేహితులతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ వచ్చింది. చాలా రోజుల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ను ఇలా నవ్వుతూ సరదాగా చూడటం ఆనందంగా ఉందంటూ ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.