హ‌నుని న‌మ్మోద్ద‌ని చెప్పింది ఎవ‌రో?

Update: 2022-08-12 06:01 GMT
గ‌డిచిన ద‌శాబ్ధంలో టాలీవుడ్ ఇండ‌స్ర్టీలో చాలా మార్పులొచ్చాయి.  ప్ర‌తిభ‌ని మెచ్చి ప్రోత్స‌హించే నిర్మాత‌లు-హీరోలు ఎక్కువ‌య్యారు. విష‌యం ఉన్న న‌వ‌త‌రం ద‌ర్శ‌క-ర‌చ‌యిత‌ల కోసం ఇండ‌స్ర్టీ వెయిట్ చేస్తుంది. నిజంగా స్కిల్స్ ఉండి స‌రైనోడి చేతిలో ప‌డితే అత‌డి రేంజ్ రాత్రికి రాత్రే మారిపోతుంది అన్న‌ది వాస్త‌వం. గ‌డిచిన ద‌శాబ్ధంలో ఎంతో మంది ప్ర‌తిభావంత‌లు  వెలుగులోకి వ‌చ్చారు.

వీళ్లంతా కేవ‌లం త‌మ ప్ర‌తిభ‌తోనే అవ‌కాశాలు అందుకున్న‌వారు. మ‌రే స‌మీక‌ర‌ణం వీళ్ల విష‌యంలో ప్ర‌వేశించ‌లేదు అన్న‌ది వాస్త‌వం. ఒక‌ప్పుడు అవ‌కాశం క‌ల్పించాలంటే? ఎన్నో స‌మీకర‌ణాలుండేవి. కొన్ని లెక్క‌లు బేరీజు వేసుకుని అవ‌కాశాలు క‌ల్పించేవారు. ప్ర‌తిభ‌తో పాటు..అన్ని ర‌కాలుగా స‌మ‌తూగిన త‌ర్వాతే అవ‌కాశం ఇచ్చేవారు. లేదంటే ఎంత ట్యాలెంట్ ఉన్నా?  ఛాన్స్  అంత ఈజీగా వ‌చ్చేది కాదు.

ఈ క్ర‌మంలో ఇండ‌స్ర్టీకి వ‌చ్చి ఇవ‌న్నీ చూసి విసుగెత్తి తిరిగెళ్లిపోయాన వారెంద‌రో? ఉన్నారు. స‌రిగ్గా హ‌ను రాఘ‌వ‌పూడి కూడా ప‌దేళ్ల క్రితం ఇలాంటి స‌మ‌స్య‌ల‌న్ని దాటుకుని ద‌ర్శ‌కుడు అయిన వాడే. ఇండ‌స్ర్టీలో అంత‌నికి ఎలాంటి బ్యాక‌ప్ లేదు. అత‌నిలో ప్ర‌తిభ‌ను గుర్తించే సాయి కొర్ర‌పాటి `అందాల రాక్ష‌సి` సినిమాకి అవ‌కాశం క‌ల్పించారు.

హ‌నుని అత‌ని వద్ద‌కు పింపించింది రాజమౌళిగా చెప్పు కుంటారు. ముందుగా అత‌నిలో విష‌యం ముంద‌ని గు ర్తించి హ‌నుని పైకి తీసుకొచ్చింది వాళ్లే. అక్క‌డ నుంచి హ‌ను సినిమా ప్ర‌యాణం మొద‌లైంది. కానీ  అత‌న మంచి క‌థ‌లు రాయ‌గ‌ల‌డు. వాటిని అంతే అందంగా మ‌ల‌చ‌గ‌ల‌డు. కానీ అదే క‌థ‌ని క‌మ‌ర్శియ‌ల్ గా చూపించ‌లేడు. అత‌నిలో అదే మైన‌స్.

ఆ త‌ర్వాత చేసిన కొన్ని సినిమాల విష‌యంలో ప్రూవ్ అయింది. అయినా హ‌ను త‌న బాణీని విడిచిపెట్ట‌లేదు. త‌న‌శైలిలో సినిమాలు చేసుకుంటూ  వ‌చ్చాడు.  దాని వెనుక స‌క్సెస్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఇటీవ‌ల రిలీజ్ అయిన `సీతారామం`తో అర్ధ‌మైంది. వ‌రుస‌గా  నాలుగు ప‌రాజ‌యాలు అత‌న్ని వెక్కిరించినా ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ అంద‌రి నోళ్లు మూయించింది.

ప‌దేళ్ల త‌ర్వాత వ‌చ్చిన స‌క్సెస్ ఇప్పుడు అత‌ని స్థాయినే  మార్చేసింది. ప్రేక్షకుల్లో వ‌చ్చిన మార్పు తోనే సీతారామం కి స‌క్సెస్ సాధ్య‌మైంది.  ఆడియ‌న్స్ హ‌ను  సినిమాల‌కు క‌నెక్ట్ అయ్యే రోజుల్లొకి అప్ డేట్ అయిన‌ట్లు  చెప్పొచ్చు. అయితే ఈ సినిమా కి నిర్మాత‌ల్ని ఒప్పించే క్ర‌మంలో  అత‌నిఫై కొన్ని దుష్ట  శక్తులు ప‌నిచేసిన‌ట్లు తెలుస్తోంది.

ఎలాగైనా అత‌ని ప్ర‌తిభ‌ను కిల్ చేయాల‌ని వెనుక గొతులు తీసే బ్యాచ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే  చిత్ర నిర్మాత‌లు స్వ‌ప్న తో హ‌నుతో సినిమా చేయోద్ద‌ని కొంద‌రు డైరెక్ట్ గానే చెప్పారు. కానీ స్వ‌ప్న ప్ర‌తిభ‌ని వెలికి తీయ‌డంలో ఓ దిట్ట‌. ఎవ‌రో ఏదో చెప్పార‌ని వాళ్ల మాట‌ల్ని న‌మ్మ లేదు. త‌ను న‌మ్మిన హ‌ను క‌థ‌ని తెర‌కెక్కించే అవంకాశం క‌ల్పించారు కాబ‌ట్టే సీతారామం లాంటి గొప్ప సినిమా ప్రేక్ష‌కులకు అందివ్వ‌గ‌లిగారు.

మ‌రి హ‌ను గురించి చెడుగా చెప్పింది ఎవ‌రు? అత‌నితో గ‌తంలో సినిమాలు చేసి ఫెయిలైన వారా?  లేక హ‌నుని కావాల‌ని ఇబ్బంది పెట్టేవారా? ఈ రెండు గాక  నిర్మాత‌లు చుట్టూ  తిరిగే భ‌జ‌న  బ్యాచ్ నా?  ఎవ‌రైనా ప్ర‌తిభావంతులు..తెలివైన  వారు ఇలాంటి వాటిని ప‌ట్టించుకోరు అన్న‌ది గ‌మ‌నించాల్సి విష‌యం. ఇలాంటివి ప‌రిశ్ర‌మ‌లోనే కాదు..ప్ర‌తీ రంగంలోనూ ఉన్నాయ‌న్న‌ది గుర్తించాలి.
Tags:    

Similar News