సీతారామం డైరెక్టర్.. పాన్ ఇండియా ప్లాన్?

Update: 2022-09-23 08:14 GMT
అందాల రాక్షసి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన హను రాఘవపూడికి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడానికి చాలా సమయం పట్టింది. మొదటి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా లాభాలను అందించలేదు. ఆ తర్వాత వచ్చిన నాని కృష్ణగాడి వీర ప్రేమ గాధ కూడా అదే తరహాలో అటు ఇటు గానే ఆడింది. ఇక తర్వాత తన స్టైల్ ను మార్చిన ఈ దర్శకుడు లై సినిమాతో అలాగే పడి పడి లేచే మనసు సినిమాలతో ఊహించని విధంగా డిజాస్టర్స్ ఎదుర్కొన్నాడు.

అతనికి టాలెంట్ ఉంది కానీ సరైన ప్లానింగ్ లేక డిజాస్టర్ అందుకుంటున్నట్లుగా గ్రహించిన వైజయంతి మూవీస్ వారు.. కాన్సెప్ట్ నమ్మి భారీగా పెట్టుబడి పెట్టి సీతారామం సినిమాను వెండితెరపైకి తీసుకువచ్చారు.

మనోడికి కరెక్ట్ టీం తగిలితే బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ చూస్తాడు అని ఈ సినిమాతో అర్థమైంది. అయితే హను రాఘవపూడి తదుపరి సినిమా ఎవరితో ఉంటుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఇంతకుముందే అతను రామ్ పోతినేని విజయ్ దేవరకొండతో కూడా కొన్ని కాన్సెప్ట్ లను అనుకున్నాడు. అలాగే నానితో కూడా ఎప్పటినుంచో ఒక వార్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం నాని దసరా అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అదే తరహాలో మరికొన్ని డిఫరెంట్ యాక్షన్ సినిమాలను చేయాలనే ఆలోచన ఉన్నాడు.

ఇక యాక్షన్ లో ఎమోషన్ కూడా కరెక్ట్ గా హైలెట్ చేస్తే పర్ఫెక్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా చేయవచ్చు అని నానితో ఇటీవల హను కూడా చర్చలు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే కొన్ని కథలపై చర్చలు జరుపుతున్న హను రాఘవపూడి డైరెక్ట్ గా నెక్స్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా చేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడట. ఎందుకంటే ఇటీవల హిందీలో కూడా సీతారామం సినిమాకు మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. మరి మనోడు ఈ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News