`ఓకే బంగారం` ఫేం దుల్కార్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `సీతారామం`. ఈ సినిమా ట్రైలర్ రేపు (25 జూలై) ఉదయం 10.30కు విడుదల కానుంది. రిలీజ్ కి ఇంకా పదిరోజుల సమయమే మిగిలి ఉండగా ప్రచారంలో టీమ్ మరింత స్పీడ్ పెంచింది. ఈ సందర్భంగా టీమ్ ఒక కాంటెస్ట్ ని ప్రకటించింది. ట్రైలర్ చూడాలనుకున్న తొలి 100 మందిలో మీరు ఉన్నారా? అంటూ టీమ్ టీజ్ చేస్తూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. దీనికి సోషల్ మీడియాలో దుల్కార్ అభిమానులు వేగంగానే స్పందిస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 10న శ్రీరామ నవమి రోజున విడుదల చేసిన సీతారామం లుక్ లోనే రష్మిక ఒక ముస్లిమ్ యువతిగా ప్రత్యక్షమైంది. రష్మిక పాత్ర పేరు అఫ్రీన్ రాముడు.. సీత కోసం యుద్ధంలో విజయం సాధించేలా చూసుకోవాలని చెప్పే పాత్ర ఇది. ఈద్ ఉల్-అధా పేరుతో రష్మిక రెండో పోస్టర్ కూడా ఆకట్టుకుంది. రష్మిక ఇందులో కాశ్మీరీ ముస్లిం అమ్మాయిగా కనిపించనుంది.
హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ సల్మాన్ మరియు సీతగా మృణాల్ ఠాకూర్ నటించారు. రష్మిక మందన్న ఆఫ్రీన్ అనే క్యారెక్టర్‌ని పోషిస్తోంది. సీతా రామం తెలుగు- తమిళం- మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ చిత్రంలో గౌతమ్ మీనన్- ప్రకాష్ రాజ్- తరుణ్ భాస్కర్- శత్రు- భూమికా చావ్లా- రుక్మిణి విజయ్ కుమార్-సచిన్ ఖేడేకర్- మురళీ శర్మ- వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కీలక పాత్ర పోషిస్తుండగా అతని ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. పోస్టర్ లో సుమంత్ లుక్స్ కి ప్రశంసలు దక్కాయి.
చక్కని ప్రేమకథతో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునే సినిమా ఇది. స్వప్న సినిమాస్ పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్లాసిక్ రొమాంటిక్ సాగాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని సమర్పిస్తోంది. దీనికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగు- తమిళం- మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ``చరిత్ర పుటల్లోని ఒక ప్రేమకథను త్వరలో మీకు సమీపంలోని థియేటర్‌లలో అందిస్తాం… #సీతారామం 2022 ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని దత్ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే దుల్కార్ ఆర్మీ మ్యాన్ గెటప్ సహా కథానాయిక మృణాల్ ట్రెడిషనల్ అవతార్ కి సంబంధించిన లుక్ లు ఆకట్టుకున్నాయి.