వీడియో : నాన్న కోసం ఛాలెంజ్ మొదలు పెట్టిన సితార

Update: 2022-02-20 08:09 GMT
సోషల్‌ మీడియాలో ఈ మద్య కాలంలో ఛాలెంజ్ లు ఎక్కువ అయ్యాయి. వర్కౌట్‌ ఛాలెంజ్ లను మొదలుకుని వంటల ఛాలెంజ్ ల వరకు ఎన్నో ఛాలెంజ్ లు ఉంటున్నాయి. ఇటీవలే బీస్ట్‌ సినిమా నుండి వచ్చిన అరబిక్ కుత్తు నుండి ఒక డాన్స్ బిట్ ను చేయాలంటూ పూజా హెగ్డే ఛాలెంజ్ చేయడం.. ఆ ఛాలెంజ్‌ ను చాలా మంది సోషల్‌ మీడియా సెలబ్రెటీలు మాత్రమే కాకుండా సమంత వంటి స్టార్‌ హీరోయిన్ కూడా ఆ ఛాలెంజ్ స్వీకరించి అరబిక్ కుత్తు కు స్టెప్పులు వేశారు.

పూజా హెగ్డే మొదలు పెట్టిన ఆ పాటకు అనూహ్యంగా స్పందన దక్కింది. పాట స్థాయిని మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు సూపర్‌ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట నుండి ఇటీవలే విడుదల అయిన కళావతి పాటకు సోషల్‌ మీడియాలో డాన్స్ ఛాలెంజ్ మొదలు అయ్యింది. ఎన్నో ఛాలెంజ్ లు మొదలు అవుతుంటాయి.. కళావతి డాన్స్‌ ఛాలెంజ్ లో ప్రత్యేకత ఏంటీ అని కొందరు అనుకోవచ్చు. ఈ ఛాలెంజ్ చాలా స్పెషల్‌.

ఎందుకంటే.. ఈ ఛాలెంజ్ ను సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు గారల పట్టి అయిన సితార మొదలు పెట్టింది. నాన్న కోసం ఈ ఛాలెంజ్ ను మొదలు పెట్టాను అంటూ సితార చెప్పుకొచ్చింది. కళావతి పాటకు అచ్చు గుద్దినట్లుగా స్టెప్పులు వేసిన సితార సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా హాట్‌ టాపిక్ అయ్యింది. సితార చూస్తుండగానే పెరిగి పోయింది.. ఇప్పుడు తను తండ్రి స్థాయిలో స్టెప్పులు వేస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సితార వేసిన స్టెప్పులకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వీడియో తో పాటు ఆమె ఛాలెంజ్ కూడా వైరల్‌ అవుతోంది. కళావతి పాటకు సోషల్‌ మీడియాలో ఇక షార్ట్‌ వీడియోలు పెద్ద ఎత్తున షేర్‌ అయ్యే అవకాశం ఉంది. ది బెస్ట్‌ షార్ట్‌ కళావతి వీడియోలను సితార తన ఇన్‌ స్టా స్టోరీ లో షేర్‌ చేస్తానంటూ హామీ ఇచ్చింది. దాంతో కళావతి పాట ను జనాలు తెగ కవర్‌ చేసే అవకాశం ఉంది.

సర్కారు వారి పాట సినిమా నుండి వచ్చిన మొదటి పాట అయిన కళావతికి మంచి రెస్పాన్స్ దక్కింది. థమన్‌ సంగీతం అందించిన ఈ పాట ను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు. అనంత శ్రీరామ్‌ ఈ పాటకు సాహిత్యంను అందించాడు. పాట కొన్ని విషయాల్లో విమర్శలను ఎదుర్కొంటున్నా.. మొత్తానికి మిలియన్స్ కొద్ది వ్యూస్ ను దక్కించుకుంటుంది. అత్యధికంగా లైక్స్ ను దక్కించుకుని దూసుకు పోతుంది. థమన్ మరియు సిద్‌ శ్రీరామ్ ల జోడీ మరో సారి సక్సెస్ కాంబో అని నిరూపితం అయ్యింది.

మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ లు మొదటి సారి కలిసి నటిస్తున్న సినిమా అవ్వడం తో అంచనాలు భారీగా ఉన్నాయి. గీత గోవిందం దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌ లో షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్‌ లో చాలా స్పెషల్‌ కాన్సెప్ట్‌ మూవీగా ఈ సినిమా నిలువబోతుంది అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.


Full View
Tags:    

Similar News