ప్రస్తుతం సినీరంగంపై ఎన్నడూ లేనంతగా రాజకీయ నాయకుల కళ్లు ఉన్నాయి. ప్రతిదానికి మనోభావాలను వంకగా చూపెడుతూ సినిమావాళ్లను విమర్శించడం కౌంటర్లు వేయడం ప్రారంభించారు. కేసులతో కోర్టులకు లాగుతున్నారు. ఇప్పుడు కింగ్ ఖాన్ షారూక్ కి ఈ సెగ తప్పడం లేదు. షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'పఠాన్' సినిమాలోని 'బేషరమ్ రంగ్' పాట తీవ్ర వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే.
దీనికి ప్రధాన కారణం దీపికా పదుకొణె ధరించిన బికినీ రంగు. బికినీ లైట్ ఆరెంజ్ (కాషాయ) కలర్ లో ఉంది. దీంతో బిజెపి నాయకులు సహా పలువురు రైట్ వింగ్ కార్యకర్తలు బికినీకి అలాంటి కలర్ ఉండకూడదని వ్యతిరేకించారు. దీపికను తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఖాన్ సినిమా రిలీజ్ ని ఆపాలని ఆ పాటను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అయితే ఇంతలోనే దీనికి కౌంటర్ రెడీ అయ్యింది. పద్మావత్ గా అసాధారణ అభిమానులను సంపాదించిన దీపికకు ఇప్పుడు నెటిజనులు ఫ్యాన్స్ నుంచి బోలెడంత మద్ధతు లభించింది. కాషాయ రంగు రిలేటెడ్ గా ప్రత్యర్థుల డ్రెస్సింగ్ సెన్స్ పైనా ఆరాలు మొదలయ్యాయి. తాజాగా ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. . ఇది 1998లో మిస్ ఇండియా పోటీలకు సంబంధించినది.
ఈ వీడియోలో స్మృతి కుంకుమపువ్వు (ఇంచుమించు కాషాయానికి దగ్గరగా) రంగు చీరను ధరించి వేదికపై క్యాట్ వాక్ చేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ దీపిక అభిమానులు రైట్ వింగ్ ట్రోల్స్ పై ఎన్ కౌంటర్ స్టార్ట్ చేసారు.
మీరు దీనికి ఏం సమాధానం చెబుతారు? అంటూ కాషాయ దళాలను ప్రశ్నించారు? నిజానికి ఈ బికినీ వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా స్వార్థ ప్రయోజనాలతో రగిలించారని 'పఠాన్' సినిమాను బహిష్కరించాలని పిలుపునివ్వడం తెలివితక్కువతనమని కూడా ఇప్పుడు ప్రతిదాడి షురూ అయ్యింది.
మంత్రులు ఎమ్మెల్యేలు దీపిక బికినీ సీన్ ని పాట నుంచి తొలగించాలని కోరడం హాస్యాస్పదం. వారు తమ పనులను తాము చూసుకోవాలి. ప్రజాసేవలో నిమగ్నమైతే సరిపోతుందని కొందరు సూచిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.