ఒక్క ఆడియో ఫంక్షన్‌.. ఎన్ని వివాదాలో!

Update: 2015-03-17 06:55 GMT
ఏదీ కావాలని చేసింది కాకపోవచ్చు. కానీ సన్నాఫ్‌ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్‌కు సంబంధించి ప్రతిదీ వివాదమే అయింది. వేడుక ముగిసి రెండు రోజులవుతున్నా ఇప్పటికీ పోస్టుమార్టం ఆగట్లేదు. ఆడియో వేదికకు సంబంధించిన విషయాల దగ్గర్నుంచి.. చివర్లో బన్నీ స్పీచ్‌ వరకు ప్రతిదీ వివాదమే అవుతోంది.

! శిల్ప కళా వేదికలో అయితే అభిమానులు దగ్గరగా ఉండేవాళ్లని.. పవర్‌ స్టార్‌ కోసం వాళ్లు చేసే గోల భరించలేకే నోవాటెల్‌లో ఆడియో వేడుక నిర్వహించారని.. అభిమానుల సీటింగ్‌ దూరంగా ఉండేట్లు చూశారన్నది వేదికకు సంబంధించిన వివాదం. మరోవైపు పరిమితికి మించి పాస్‌లు ముద్రించినందుకు ఈ వేడుక నిర్వహించిన శ్రేయాస్‌ మీడియా యజమానిని అరెస్టు చేసినట్లు వార్తలొస్తున్నాయి.

! సాధారణంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆడియో వేడుక అంటే మిగతా మెగా హీరోల్లో ఒకరిద్దరైనా కచ్చితంగా వస్తారు. బన్నీ సినిమా ఆడియో వేడుకకు చరణ్‌.. చరణ్‌ వేడుకకు బన్నీ రావడం సర్వ సాధారణం. కానీ ఈసారి బన్నీ కోసం చరణ్‌ సహా ఎవరూ రాలేదు. పైగా దాసరి నారాయణ రావు వచ్చి అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కోసమే వచ్చానంటూ మెగా ఫ్యామిలీలో ఓ చీలిక తీసుకొచ్చాడు.

! ఇక చిరు ప్రస్తావన లేకుండా సాగిన దాసరి ప్రసంగం.. స్టయిల్‌ గురించి మాట్లాడి పవన్‌ను ఆకాశానికెత్తేయడం.. చివర్లో బన్నీ ఆయనకు కౌంటర్‌ ఇస్తున్నట్లు తన కెరీర్‌ ఎదుగుదలకు సంబంధించిన క్రెడిట్‌ అంతా మెగా అభిమానులకే ఇచ్చేసి.. పవన్‌ పేరే ఎత్తకపోవడం పెద్ద వివాదమే అయింది. ఈ గొడవ చాలదన్నట్లు దాసరికి ఇన్‌డైరెక్టుగా కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చేసిన బండ్ల గణేష్‌ మరింత అగ్గిరాజేసే ప్రయత్నం చేశాడు.

! వీటన్నింటికి తోడు త్రివిక్రమ్‌ పవన్‌ను ఏకంగా దేవుడితో పోల్చేయడం.. ఆలీ సుమను ఉద్దేశించి బూతు డైలాగ్‌ వేయడం కూడా వివాదాస్పదమే అయ్యాయి. మొత్తానికి ఒక్క ఆడియో వేడుక ఎన్ని వివాదాలకు దారితీసిందో అని చర్చించుకున్నారు టాలీవుడ్‌లో.

Tags:    

Similar News