పవన్‌, మహేష్‌లను దాటేసిన బన్నీ

Update: 2015-03-17 09:30 GMT
అత్తారింటికి దారేది టాలీవుడ్‌ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా. రూ.80 కోట్ల దాకా వసూలు చేసిన ఈ సినిమాకు కూడా థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.50 కోట్లకే జరిగింది. గత ఏడాది మహేష్‌ సినిమా ఆగడు కూడా ఇదే స్థాయిలో బిజినెస్‌ జరుపుకుంది. ఐతే అల్లు అర్జున్‌ వాళ్లిద్దరినీ మించి పోయాడు. అతడి కొత్త సినిమా 'సన్నాఫ్‌ సత్యమూర్తి' థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.54 కోట్ల దాకా ఉండటం విశేషం.

ఇప్పటిదాకా ప్రి రిలీజ్‌ బిజినెస్‌ విషయంలో ఏ సినిమా కూడా ఈ రేంజి అందుకోలేదు. ఈ విషయంలో బన్నీదే ఆల్‌టైం రికార్డు. గత ఏడాది వరకు టాప్‌-5 హీరోల్లో చోటు లేని బన్నీ.. 'రేసుగుర్రం' తర్వాత తన రేంజిని ఏ స్థాయిలో పెంచుకున్నాడో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. త్రివిక్రమ్‌ ట్రాక్‌ రికార్డు కూడా కలిసి రావడం.. సినిమా మీద ఫుల్‌ పాజిటివ్‌ బజ్‌ ఉండటంతో బయ్యర్లు ధైర్యంగా డబ్బులు పెట్టేశారు.

ఏరియాల వారీగా బ్రేకప్స్‌ చూస్తే అత్యధిక ధర పలికింది నైజాం ప్రాంతానికి. రూ.13.5 కోట్లు పెట్టి దిల్‌ రాజు ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. సీడెడ్‌ రైట్స్‌ రూ.7.6 కోట్లకు లక్ష్మీకాంత్‌ రెడ్డి తీసుకున్నాడు. వైజాగ్‌ (రూ.5.25 కోట్లు), ఈస్ట్‌ (రూ.3 కోట్లు), వెస్ట్‌ (రూ.2.52 కోట్లు), కృష్ణా (రూ.2.7 కోట్లు), గుంటూరు (రూ.3.7 కోట్లు), నెల్లూరు (రూ.1.35 కోట్లు) ఏరియాల్లోనూ మంచి రేటు పలికింది. కర్ణాటక హక్కులు రూ.6.5 కోట్లకు అమ్మడం విశేషం. ఓవర్సీస్‌ రైట్స్‌ రూ.6 కోట్లు పలికాయి. ఇండియాలోని మిగతా ప్రాంతాల రైట్స్‌ని రూ.1.5 కోట్లకు ఇచ్చారు. అంటే రూ.54 కోట్ల మేర బిజినెస్‌ జరిగింది. మళయాళ డబ్బింగ్‌ రైట్స్‌ రూ.1.75 కోట్లు పలికినట్లు సమాచారం. శాటిలైట్‌, ఆడియో, ఇతర హక్కులు కలిపి ఇంకో రూ.11 కోట్ల దాకా వచ్చాయి. అంటే విడుదలకు ముందే నిర్మాత రూ.67 కోట్ల దాకా జేబులో వేసుకున్నాడు.

Tags:    

Similar News