సత్యమూర్తి ఏమిచేశాడు తంబీ!

Update: 2015-04-10 07:36 GMT
ఎవరికి ఏవరిపై కోపం వచ్చినా అది తిరిగి తిరిగి సినిమావాళ్ల వైపు తిరుగుతుంటుంది. పైగా సినిమాలపైనా, సినిమావాళ్లపైనా దాడులు చేయడం సులువు అని భావించే ఒకవర్గం జనం... వారి మనుగడను కాపాడుకోవడానికి దీన్ని సులువైన మార్గంగా ఎంచుకుంటుంటారు. తాజాగా శేషాచలం అడవుల్లో జరిగిన ఎంకౌంటర్ తర్వాత తమిళులు తోకిప్పారు. వారేదో ఆంజనేయ స్వామి వారసులమన్నట్లు, ఏపీ ఏదో లంక అయినట్లు... దహనాలు చేసేస్తున్నారు. కనిపించిన బస్సులను, ఏపీ వారికి సంబందించిన కంపెనీలకు నిప్పులు పెడుతున్నారు.
ఇదే క్రమంలో గురువారం విడుదలయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా థియేటర్స్ పై కూడా తంబీలు దాడులకు తెగబడ్డారు. కాంచీపురంలోని బాబు కాంప్లెక్స్ లో నడుస్తున్న సత్యమూర్తి సినిమాపై దాడులు చేశారు. పోస్టర్స్ ని, ప్లెక్సీలను చింపి చిందరవందర చేయడంతో ఆగని వారి ఆగ్రహం... సినిమాని ప్రదర్శనను ఆపేవరకూ వచ్చింది. ఈ విషయంపై విజ్ఞత కలిగిన రాజకీయ పార్టీల నేతలు దాడులు జరగకుండా చూడాలని కోరుకుంటున్నారు ఏపీ సినీ జనాలు!
Tags:    

Similar News