నేను వెయిటింగ్ అని టాలీవుడ్ ఫీలవ్వాలి

Update: 2016-07-12 15:30 GMT
ప్రశ్న: తెలుగు సినిమాల్లో ఎందుకు మెరవట్లేదు?...
''నేను కూడా వెయిట్‌ చేస్తున్నా.. తెలుగు సినిమాలకు పిలుస్తారని.. కాని టాలీవుడ్‌ నుండి పిలుపు రావట్లేదు. ఎంతసేపూ నాకొక్క దానికే కాదు కదా ఆ ఆత్రం ఉండాల్సింది. ఇక్కడ టాలీవుడ్ వాళ్లకి కూడా నాకో ఛాన్సివ్వాలి అనే ఫీలింగ్ ఉండాలి కదా. ఇట్ ఈజ్ టూ వే'' అని జవాబు చెప్పింది తెలుగు బ్యూటి శోభిత ధూలిపాళ. వైజాగ్ లో పెరిగిన ఈ అమ్మాయి.. మిస్‌ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలుచుకున్న తరువాత.. తెలుగులో బాగా పాపులర్ అవుదాం అనుకుంది ఈ అమ్మడు. కాని ఇప్పటివరకు తెలుగులో ఒక్క అవకాశం కూడా రాకపోవడం అమ్మడికి షాకిచ్చింది.

ఈ మధ్యనే రమన్ రాఘవ్ 2.0 అనే సినిమాతో బాలీవుడ్‌ లో అడుగుపెట్టింది ఈ హాటీ. ఇప్పటివరకు మిస్‌ ఇండియా రన్నరప్ హోదాలో అమ్మడు ఎంత గ్లామరసం పండించిందో ఒక్కసారి ఆమె ఫోటో షూట్లను చూస్తే తెలుస్తుంది. అయితే ఎంత హాటుగా కనిపించినా కూడా.. ఈ అమ్మాయి తెలుగు పిల్ల కాదనుకున్నారో లేకపోతే ఇంత హాటుగా కనిపించే తెలుగు పిల్లను భరించలేం అనుకున్నారో తెలియదు కాని.. టాలీవుడ్ లో మాత్రం అమ్మడికి అవకాశమే రాలేదు. ఇక బాలీవుడ్ లో కూడా ఆ సినిమాతో కాసింత మాంచి పేరునే సంపాదించుకున్న ఈ తెలుగు బ్యూటి.. త్వరలో ఒక పెద్ద హీరోతో అక్కడే సినిమా చేయనుందట. అది సంగతి.
Tags:    

Similar News