బాహుబ‌లి నిర్మాత‌లు భారీ ప్ర‌యోగం

Update: 2019-03-20 04:42 GMT
భ‌విష్య‌త్ ని శాసించేది డిజిట‌ల్ మీడియ‌మే! అందులో ఎలాంటి సందేహం లేదు. క‌మ‌ల్ హాస‌న్ చెప్పిన‌ట్టే సినిమా డైరెక్ట్ టు హోమ్‌.. డీటీహెచ్ సిస్ట‌మ్ ఇప్ప‌టికే అమ‌ల్లోకి వ‌చ్చేస్తోంది. అంత‌కంటే ముందే డిజిట‌ల్ మీడియం ఆ స్థానాన్ని ఆక్ర‌మించేసింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి కార్పొరెట్ దిగ్గ‌జాల రాక‌తో సినిమా సీన్ మొత్తం మారిపోయింది. అర‌చేతిలో మొబైల్ లోనే వెబ్ సిరీస్ లను సినిమా నాణ్య‌త‌తో చూసుకునే సౌక‌ర్యం క‌లిగింది. ప‌ర్య‌వ‌సానంగా జ‌నాలు థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూడాలి అన్న ఆలోచ‌న త‌గ్గించేస్తున్నార‌ని స‌ర్వేలు చెబుతున్నాయి.

భ‌విష్య‌త్ అంతా డిజిట‌ల్ దే... అందుకే టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్ర‌స్తుతం డిజిట‌ల్ మాధ్య‌మంపై దృష్టి సారించింద‌ని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఓ భారీ వెబ్ సిరీస్ ని నిర్మించేందుకు స‌ద‌రు సంస్థ అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి భారీ సంస్థ‌ల‌తో డీల్ కుదుర్చుకుంటోంద‌ని తెలుస్తోంది. ప్ర‌ఖ్యాత త‌మిళ ర‌చ‌యిత‌ మ‌ను ఎస్.పిళ్లై ర‌చ‌న `ది ఐవ‌రీ థ్రోన్` (2015).. హ‌క్కులు ఆర్కా సంస్థ చేజిక్కించుకుంది. ఆడియో - విజువ‌ల్ రైట్స్ ని ఆర్కా సంస్థ ఛేజిక్కించుకుంది. చ‌రిత్ర‌లో దాగి ఉన్న క‌థ‌ల్ని బ‌య‌టి ప్ర‌పంచానికి చూపించ‌డ‌మే మా ధ్యేయ‌మ‌ని నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ ప్ర‌క‌టించారు. 1929-1949 మ‌ధ్య జ‌రిగిన ఓ హిడెన్ నాన్ ఫిక్ష‌న్ హిస్టారిక‌ల్ సిరీస్ ఇద‌ని తెలిపారు.

ఈ వెబ్ సిరీస్ క‌థాంశం ప‌రిశీలిస్తే .. ఎంతో ఆస‌క్తిక‌రం. ఇది ట్రావెన్ కోర్ మ‌హారాణి సేతు ల‌క్ష్మీ భాయ్ జీవిత క‌థ ఆధారంగా రాసిన పుస్త‌కం. ఇందులో ఆంగ్లేయుల పాత్రలు క‌నిపిస్తాయి. రాజా ర‌వి వ‌ర్మ ఆయ‌న భార్యామ‌ణి జీవితానికి క‌నెక్టివిటీ ఉన్న క‌థాంశం కూడా ఇది.. అని తెలుస్తోంది. ఇలాంటి క‌థ‌ల్ని ఒక సినిమాగా తీస్తే న్యాయం జ‌ర‌గ‌దు. ఒక సిరీస్ గా తెర‌కెక్కిస్తేనే న్యాయం చేయ‌గ‌ల‌మ‌ని శోభు యార్ల గ‌డ్డ తెలిపారు. ఈ పుస్త‌కం హక్కులు ఛేజిక్కించుకున్న సంద‌ర్భంగా మీడియాకి వివ‌రాల్ని వెల్ల‌డించారు. బాహుబ‌లి సిరీస్ తో సంచ‌ల‌నాలు సృష్టించిన స‌ద‌రు నిర్మాత ఈ వెబ్ సిరీస్ ల‌పై దృష్టి సారించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.


Tags:    

Similar News